దారుణం: 50 కోతులకు విషమిచ్చి.. ఆపై గోనెసంచుల్లో కట్టిపడేసి..!

July 30, 2021 7:23 PM

సమాజంలో మనుషులులో ఉండాల్సిన మానవత్వం రోజురోజుకు దిగజారిపోతుంది. సాటి మనుషుల పట్ల మూగజీవాల పట్ల ఎంతో ఉదార స్వభావాన్ని చాటు కోవాల్సిన మనుషులు రోజురోజుకు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక, హసన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నోరులేని 50 కోతులకు ఆహారంలో విషమిచ్చి చంపిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

కర్ణాటక, హసన్ జిల్లాలో చౌడనహళ్లి సమీపంలోని ఓ రోడ్డు సమీపంలోని గ్రామస్తులు ఒక గోనెసంచి పడి ఉండటం గమనించారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు వెళ్లి ఆ గోనె సంచిని తెరిచి చూడగా అందులో కోతులు విగతజీవులుగా కనిపించాయి. ఈ క్రమంలోనే గ్రామస్తులు వాటిని బయటికి తీయడంతో సుమారు 50 కోతులు ఒకే సంచిలో ఉండటం వల్ల ఊపిరాడక వీటిలో 38 కోతులు ప్రాణాలను కోల్పోయాయి. మరికొన్ని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు చనిపోయిన కోతులను పోస్టుమార్టానికి తరలించారు దీంతో వాటిపై విష ప్రయోగం జరగడం వల్ల చనిపోయాయని గుర్తించారు. అదేవిధంగా వాటిని ఒక సంచిలో వేసి ఘోరంగా కొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారులు ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్నటువంటి బేలూర్, సక్లేష్ పూర్‌లో చాలా కోతులున్నా వాటికి వచ్చే నష్టమేమీ కలగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.అయితే ఈ ప్రాంతంలో చనిపోయిన కోతులు ఈ ప్రాంతానికి చెందినవి కాదని, ఎక్కడో చనిపోవటం వల్ల తీసుకువచ్చి ఇక్కడ వేసి ఉంటారని అధికారులు భావించారు.ప్రస్తుతం కోతులకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో తెలియడంతో పలువురు జంతు ప్రేమికులు నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment