ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె న‌టించిన తెలుగు చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

April 3, 2026 9:50 PM
Varalaxmi Sarathkumar's movie S. Saraswathi streaming on Amazon Prime Video.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఎస్. సరస్వతి’. Photo Credit: Amazon Prime Video.

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె న‌టించిన తెలుగు చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఇక తాజాగా ఆమె స్వ‌యంగా న‌టించి ద‌ర్శ‌క‌త్వం వహించ‌డ‌మే కాకుండా స్వీయ నిర్మాణంలో ఎస్‌.స‌ర‌స్వ‌తి పేరిట ఓ చిత్రాన్ని విడుద‌ల చేశారు. మార్చి 6, 2026న థియేట‌ర్ల‌లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్ర‌మ స్పంద‌న‌ను ద‌క్కించుకుంది. అయితే ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ మూవీని రిలీజ్ చేశారు. మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఐఎండీబీలో 10కి 6.8 రేటింగ్ వ‌చ్చింది. అంటే సినిమా యావ‌రేజ్ అన్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన ఈ మూవీ ఆ జోన‌ర్ ప్రేక్ష‌కుల‌ను క‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక సినిమా క‌థ‌, ఇత‌ర వివ‌రాలు ఇలా ఉన్నాయి.

సినిమా క‌థ ఏంటంటే..

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఎస్‌.స‌ర‌స్వ‌తి చిత్రాన్ని స్వ‌యంగా నిర్మించారు. ఆమె ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. ఈ సినిమాలో జీవా, ప్ర‌కాష్ రాజ్‌, ముర‌ళీ శ‌ర్మ‌, రావు ర‌మేష్‌, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ల‌క్ష్మి (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌) ఓ అనాథ‌. ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో న‌ర్సుగా ప‌నిచేస్తూ త‌న కుమార్తె ఎస్‌.స‌ర‌స్వ‌తితో క‌లిసి జీవిస్తుంటుంది. ఆగ‌స్టు 15న త‌న కుమార్తెను ఆమె స్కూల్‌లో దించి ఉద్యోగానికి వెళ్తుంది. సాయంత్రం తిరిగి స్కూల్‌కు వ‌చ్చేస‌రికి త‌న కుమార్తె స్కూల్‌లో క‌నిపించ‌దు. దీనిపై స్కూల్ యాజ‌మాన్యాన్ని ఆమె ప్ర‌శ్నిస్తుంది. కానీ వారు అస‌లు స‌ర‌స్వ‌తి అనే పేరుతో ఆ క్లాస్‌లో ఎవ‌రూ లేర‌ని చెబుతారు. అయితే త‌రువాత ఆమె త‌న కుమార్తెను ముగ్గురు వ్య‌క్తులు అత్యాచారం చేసి హ‌త్య చేశార‌ని, ఆమె మృత‌దేహాన్ని ఓ చోట పాతిపెట్టాన‌ని చెబుతూ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్తుంది. పోలీసులు ఆమె చెప్పిన ప్ర‌దేశంతో త‌వ్వి చూస్తారు. కానీ మృత‌దేహం క‌నిపించ‌దు. దీంతో సాక్ష్యాలు లేవ‌ని పోలీసులు కేసు న‌మోదు చేయ‌కుండా వ‌దిలేస్తారు. దీనిపై ఆమె లాయ‌ర్ రామానుజం (ప్ర‌కాష్ రాజ్‌) స‌హాయంతో కోర్టులో పిటిష‌న్ వేస్తుంది. కానీ సాక్ష్యాలు లేని కార‌ణంగా అక్క‌డ కూడా కేసును కొట్టేస్తారు. అయితే చివ‌ర‌కు ఏమ‌వుతుంది..? ల‌క్ష్మి త‌న కుమార్తెను చంపిన ముగ్గుర్ని క‌నిపెట్టి ఏం చేసింది..? త‌రువాత ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి..? చివ‌ర‌కు ఏమ‌వుతుంది..? అన్న వివ‌రాలు తెలియాలంటే సినిమాను ఓటీటీలో చూడాల్సిందే.

నెటిజ‌న్ల రివ్యూలు ఎలా ఉన్నాయి..?

సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో వ‌చ్చిన ఈ మూవీ ఆ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను క‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని సినిమాకు ఇప్ప‌టి వ‌ర‌కు నెటిజ‌న్లు ఇచ్చిన రివ్యూల‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. కొంద‌రు సినిమా పాత క‌థే అని తెల‌ప‌గా, మ‌రికొంద‌రు మాత్రం మూవీ ఆక‌ట్టుకుంటుంద‌ని, ఒక‌సారి చూడ‌వ‌చ్చ‌ని రివ్యూలు ఇచ్చారు. అయితే వీకెండ్‌లో ఏ మూవీని చూద్దామ‌ని ఆలోచిస్తున్నవారు ఈ సినిమాపై ఓ లుక్కేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment