దారుణం: ఝార్ఖండ్ లో నడిరోడ్డుపై దారుణ హత్య.. బయట పెట్టిన సీసీటీవీ ఫుటేజ్..

July 29, 2021 10:36 PM

ఝార్ఖండ్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఉత్తమ్ ఆనంద్ అనే జడ్జి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ తాజాగా ఈ కేసులో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జడ్జి ఆనంద్ రోడ్డుప్రమాదంలో మరణించలేదని.. ఆయనను కావాలనే ఒక టెంపోతో గుద్ధి చంపారని ఒక సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఝార్ఖండ్ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జడ్జి ఉత్తమ్ ఆనంద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఈ కేసు విచారణలో భాగంగా ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి. రోడ్డు పక్కన జాగింగ్ చేస్తూ వెళ్తున్నటువంటి జడ్జిను కొందరు వ్యక్తులు కావాలనే టెంపోతో గుద్ది చంపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ టెంపర్ డ్రైవర్ ఆచూకీని వెతికి పట్టుకున్నారు.ఈ క్రమంలోనే డ్రైవర్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఇది పథకం ప్రకారమే జరిగిన హత్య అని గిరిధ్ పోలీసులు తెలిపారు. ఒక కేసులో జడ్జ్ వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం వల్లే అతనిపై ఈ విధంగా కక్ష పెంచుకుని పథకం ప్రకారమే చంపి ఉంటారని భావించిన పోలీసులు అదే కోణంలో కేసు విచారణ చేపట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment