విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు పెట్టింది. ఇటీవ‌లే ఈ ఇద్ద‌రూ త‌మ వివాహ బంధానికి అధికారికంగా స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు తెలిపారు.

March 18, 2026 12:31 PM
Hansika Motwani seeking blessings at Golden Temple Amritsar.
విడాకుల అనంతరం తన తల్లి మోనాతో కలిసి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించిన హన్సిక. Photo Credit: Hansika Motwani/Instagram.

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు పెట్టింది. ఇటీవ‌లే ఈ ఇద్ద‌రూ త‌మ వివాహ బంధానికి అధికారికంగా స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు తెలిపారు. వీరి వివాహం గ‌తంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ్గా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ ప్ర‌త్యేక వీడియో రిలీజ్ అయింది. కాగా ఇటీవ‌లే వీరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2022 డిసెంబర్ 4న వివాహం చేసుకున్న ఈ జంట త‌మ మూడున్న‌రేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడిపోయారు. అయితే హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ సంద‌ర్శ‌న అనంతరం పెట్టిన పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. ఆమె ఏ నేప‌థ్యంలో ఆ పోస్టు పెట్టి ఉంటుంద‌ని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

ఆధ్యాత్మికత వైపు అడుగులు..

గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించిన అనంత‌రం హ‌న్సిక ఇన్‌స్టాగ్రామ్‌లో Held by Him, always. Waheguru di meher naal. అనే క్యాప్ష‌న్‌తో పోస్టు పెట్టింది. చిత్రంలో ఆమె స్వ‌ర్ణ దేవాల‌యం వ‌ద్ద కోనేరు స‌మీపంలో ప్రార్థిస్తున్న‌ట్లు ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. విడాకుల అనంత‌రం ఆధ్యాత్మిక‌త వైపు మళ్లిన‌ట్లు హ‌న్సిక పోస్టును చూస్తే అర్థ‌మ‌వుతోంది. గ‌తంలో స‌మంత కూడా నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం అనేక ఆధ్యాత్మిక క్షేత్రాల‌ను సంద‌ర్శించింది. అందువ‌ల్ల హ‌న్సిక కూడా ప్ర‌స్తుతం అవే భావాల‌తో ఉంద‌ని స్ప‌ష్ట‌మవుతోంది. ఇలాంటి క‌ష్ట‌మైన స‌మ‌యంలో దైవం అండ‌గా ఉండాల‌ని చాలా మంది కోరుకుంటారు. అందుక‌నే హ‌న్సిక కూడా అలాగే చేస్తోంది. ఇక హ‌న్సిక విడాకులు తీసుకోవ‌డంపై నెటిజ‌న్లు, ఆమె ఫ్యాన్స్ కూడా విచారం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీలు అధికంగా విడాకులు తీసుకుంటున్నార‌ని, చిన్న చిన్న గొడ‌వ‌ల‌కే డైవోర్స్‌కు అప్లై చేస్తున్నార‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

ఎలాంటి భ‌ర‌ణం కోర‌లేదు..

కాగా వివాహం అనంత‌రం హ‌న్సిక దంప‌తుల‌కు ప‌లు విష‌యాల్లో విభేదాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వీరి మ‌ధ్య నెల‌కొన్న గొడ‌వ‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కుటుంబ స‌భ్యులు, స్నేహితులు కూడా ప్ర‌య‌త్నించార‌ట‌. కానీ ఆ ప్ర‌య‌త్నాలు అన్నీ విఫ‌లం అయ్యాయి. దీంతో ఈ ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ వివాహ బంధానికి ముగింపు ప‌లికారు. అయితే విడాకుల‌కు ముందు చాలా రోజుల కింద నుంచే వీరిద్ద‌రూ వేర్వేరు ఇళ్ల‌లో నివసిస్తున్న‌ట్లు త‌మ విడాకుల పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇక ఒక‌రిపై ఒకరు ఎలాంటి ఆర్థిక లేదా ఇత‌ర క్లెయిమ్‌లు కూడా చేయ‌లేదు. అయితే భ‌ర్త సోహైల్ ఖ‌తురియా నుంచి హ‌న్సిక ఎలాంటి భ‌ర‌ణం కోర‌లేద‌ని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది అద్నాన్ షేక్ వెల్ల‌డించారు. ఆమె వ్య‌క్తిగ‌త‌మైన‌, వృత్తిప‌ర‌మైన జీవితంలో ముందుకు సాగాల‌ని కోరుకుంటుంద‌ని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment