గూగుల్ పిక్స‌ల్ 10పై భారీ ఆఫర్: ఏకంగా రూ.13వేల‌కు పైగా తగ్గింపు.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

గూగుల్ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్స‌ల్ 10ను కొనాలనుకున్నప్పటికీ ధర కారణంగా వెన‌కడుగు వేసిన వారికి శుభవార్త. పిక్స‌ల్ 10 ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. భారత్‌లో ప్రారంభ ధర రూ.79,999గా ఉన్న ఈ ఫోన్‌పై ప్రస్తుతం రూ.13,000కు పైగా తగ్గింపు లభిస్తోంది.

February 10, 2026 10:30 PM
Google Pixel 10 smartphone with massive discount offer in India.
గూగుల్ పిక్స‌ల్ 10 స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న భారీ ధర తగ్గింపు వివరాలు. Photo Credit: Android Central.

గూగుల్ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్స‌ల్ 10ను కొనాలనుకున్నప్పటికీ ధర కారణంగా వెన‌కడుగు వేసిన వారికి శుభవార్త. పిక్స‌ల్ 10 ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. భారత్‌లో ప్రారంభ ధర రూ.79,999గా ఉన్న ఈ ఫోన్‌పై ప్రస్తుతం రూ.13,000కు పైగా తగ్గింపు లభిస్తోంది. క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం, శక్తివంతమైన కెమెరా వ్యవస్థ, ఏఐ ఆధారిత ఫీచర్లతో పిక్స‌ల్ 10 ఫ్లాగ్‌షిప్ విభాగంలో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం ఉండవని నిపుణులు చెబుతున్నారు.

రూ.13వేల‌కు పైగా డిస్కౌంట్‌..

గూగుల్ పిక్స‌ల్ 10ను అమెజాన్ లో ప్రస్తుతం రూ.70,420కి లిస్ట్ చేశారు. అంటే అంత‌కు ముందు ఉన్న ధ‌ర‌తో పోలిస్తే నేరుగా రూ.9,579 తగ్గిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అలాగే అదనంగా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై మరో రూ.3,500 డిస్కౌంట్ లభిస్తోంది. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరింత తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.13వేల‌కు పైగా డిస్కౌంట్‌ను వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు.

అదిరిపోయే ఫీచ‌ర్లు..

ఇక గూగుల్ పిక్స‌ల్ 10 ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ఇందులో గూగుల్ రూపొందించిన టెన్సార్ జి5 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 12జీబీ వ‌ర‌కు ర్యామ్‌, 256జీబీ వ‌ర‌కు స్టోరేజ్ ల‌భిస్తున్నాయి. 4,970ఎంఏహెచ్‌ బ్యాటరీ కూడా ఉంది. దీనికి 30 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌, 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా ఇచ్చారు. ఈ ఫోన్ 6.3 ఇంచుల ఓలెడ్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. 120 హెడ్జ్‌ రిఫ్రెష్ రేట్ ను ఇస్తున్నారు. గరిష్టంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ 2 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉండ‌గా ఇది మాక్రో ఫోక‌స్ తో ప‌నిచేస్తుంది. అలాగే 13 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. దీంతో 5ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ ల‌భిస్తుంది. ముందు భాగంలో 10.5 మెగాపిక్స‌ల్ కెమెరాను ఇచ్చారు.

గ‌మ‌నిక‌: గూగుల్ పిక్స‌ల్ 10 ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న వారికి ఇది చ‌క్క‌ని ఆఫ‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు. ఆఫ‌ర్ ప‌రిమిత కాలం పాటు మాత్ర‌మే ఉంటుంది క‌నుక వినియోగ‌దారులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు అమెజాన్‌లో ఫోన్ పేజీని సంద‌ర్శించి డిస్కౌంట్లు, ఆఫ‌ర్ల‌ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment