
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్, మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులకు ఇది గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలో పనిచేసే అరుదైన అవకాశం. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించిన బృందంతో కలిసి పని చేసే అవకాశం మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి నిపుణుల నుంచి మార్గనిర్దేశం, ఆకర్షణీయమైన స్టైపెండ్ కూడా ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ను బెంగళూరు, హైదరాబాద్, పూణె వంటి ప్రధాన భారత నగరాల్లో నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు అత్యాధునిక ఆఫీస్ సదుపాయాలు, ఉచిత భోజనం, ప్రీమియం వర్క్ ఎన్విరాన్‌మెంట్‌తో పాటు, చాలా ఫుల్‌టైమ్ ఉద్యోగాల కంటే ఎక్కువ స్టైపెండ్ అందనుంది.
స్టైపెండ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి
- బ్యాచిలర్ విద్యార్థులు (B.Tech / BE): నెలకు సుమారు రూ. 1,25,000
- మాస్టర్స్ విద్యార్థులు (M.Tech / ME): నెలకు సుమారు రూ. 1,34,000
- పీహెచ్‌డీ విద్యార్థులు: రీసెర్చ్ ఆధారిత పోస్టులకు ఇంకా ఎక్కువ స్టైపెండ్
అర్హతలు, దరఖాస్తు విధానం
ఈ ఇంటర్న్‌షిప్‌కు అర్హత పొందాలంటే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్ లేదా సంబంధిత విభాగాల్లో చదువుతున్న విద్యార్థులు కావాలి. అలాగే క్రింది ప్రోగ్రామింగ్ భాషలపై అవగాహన అవసరం.
- C++
- Java
- Python
- Go
దరఖాస్తు చేయాలంటే..
- గూగుల్ అధికారిక కెరీర్ వెబ్‌సైట్ (https://www.google.com/about/careers/applications/)ను సందర్శించాలి.
- సెర్చ్ బార్‌లో Intern అని టైప్ చేయాలి.
- సంబంధిత పోస్టును ఎంచుకొని రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి అప్లై చేయాలి.
- చివరి తేదీ: మార్చి 31, 2026.
ఇంటర్న్‌షిప్ కేటగిరీలు
విద్యార్హతలను బట్టి గూగుల్ పలు రకాల ఇంటర్న్‌షిప్ పోస్టులను అందిస్తోంది.
Software Engineering PhD Intern
- వ్యవధి: 12 నుంచి 14 వారాలు
- లక్ష్యం: క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లపై పరిశోధన, అభివృద్ధి
Silicon Engineering Intern (PhD)
- కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న వారికి
- నెక్ట్స్ జనరేషన్ క్లౌడ్ సిలికాన్ డిజైన్‌పై పని
Student Researcher 2026
- UG, PG, PhD విద్యార్థులకు అవకాశం
- విభాగాలు: కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, నేచురల్ సైన్సెస్
ఎంపిక విధానం
గూగుల్ ఇంటర్న్‌షిప్ పొందడం అంత సులువు కాదు. ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది.
- రెజ్యూమ్ స్క్రీనింగ్
- అకడమిక్ రికార్డులు
- ప్రాజెక్ట్ అనుభవం
- టెక్నికల్ ఇంటర్వ్యూ
- కోడింగ్ స్కిల్స్
- డేటా స్ట్రక్చర్స్
- ఆల్గోరిథమ్స్
- గూగుల్‌నెస్ రౌండ్ (Googliness Round)
- టీమ్‌వర్క్ సామర్థ్యం
- గూగుల్ వర్క్ కల్చర్‌కు సరిపోతారా లేదా అనే అంశాల పరిశీలన
గూగుల్ ఇంటర్న్‌షిప్ జీతభత్యాలు
భారతదేశంలో గూగుల్ ఇంటర్న్‌లకు ఇచ్చే స్టైపెండ్ సాధారణంగా నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,00,000 పైగా వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. కానీ 2026 ప్రోగ్రామ్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ విద్యార్థులకు ఇచ్చే స్టైపెండ్ ఈ మొత్తాన్ని మించి ఉండటం విశేషం.








