
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి నయనతార కూడా స్పందిస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అల్లు అర్జున్ ఈ సినిమాపై పొడవాటి నోట్‌ను షేర్ చేస్తూ, Mana ShankaraVara Prasad Garu టీమ్ మొత్తానికి అభినందనలు. బాస్ తిరిగి వచ్చారు. మన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వెండితెరపై మెరవడం చాలా ఆనందంగా ఉంది. ఫుల్ విన్టేజ్ వైబ్స్.. అంటూ ప్రశంసించారు. అలాగే వెంకటేష్ గురించి ప్రస్తావిస్తూ, వెంకీ మామ షోని దుమ్మురేపారు.. అని పేర్కొన్నారు. నయనతార నటనను కూడా మెచ్చుకుంటూ, నయనతార గ్రేస్‌ఫుల్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది.. అని రాశారు. చివరగా ఈ సినిమాను సంక్రాంతి బాస్ బ్లాక్‌బస్టర్ గా అభివర్ణించారు.
CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru
The BOSS IS BACK ❤️🔥 L – I – T 🔥
Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes
⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026
థాంక్యూ బన్నీ అని పోస్ట్ చేసిన నయనతార..
అల్లు అర్జున్ చేసిన ఈ ప్రశంసలకు నయనతార ఎంతో సరళంగా స్పందించారు. ఆయన పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ, థ్యాంక్యూ బన్నీ, స్వీట్ ఆఫ్ యూ.. అని రాసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ఏడో రోజుకే ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అలరించిన చిరంజీవి – వెంకటేష్ కాంబో..
ఈ సినిమాలో నయనతార సంపన్న వ్యాపారవేత్త కుమార్తె శశిరేఖ పాత్రలో నటించగా, చిరంజీవి ఎన్‌ఐఏ అధికారి శంకరవరప్రసాద్ పాత్రలో కనిపించారు. ప్రత్యేక ఆకర్షణగా దగ్గుబాటి వెంకటేష్ కీలక పాత్రలో నటించగా, చిరంజీవి – వెంకటేష్ తొలిసారిగా కలిసి వెండితెరపై కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే, పుష్ప 2: ది రూల్ ఘనవిజయం తర్వాత ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 26వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ కనగరాజ్‌తో మరో ప్రాజెక్ట్‌కు కూడా సిద్ధమవుతున్నారు.








