NTPC లో ఉద్యోగాలు.. కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.. అర్హతలు ఇవే..

July 28, 2021 10:17 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) లో ఖాళీగా ఉన్నటువంటి ఎక్సిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా NTPC ఖాళీగా ఉన్నటువంటి 22 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ పోస్టుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 2021 ఆగస్టు 6వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉండగా అందులో ఎగ్జిక్యూటివ్‌ కమర్షియల్‌– 14, ఎగ్జిక్యూటివ్‌ కన్సల్టెన్సీ– 03, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌–1, ఎగ్జిక్యూటివ్‌ క్లీన్‌ టెక్నాలజీస్‌– 01,సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ కంపెనీ సెక్రటరీ– 01,సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ సోలార్‌– 01,ఎగ్జిక్యూటివ్‌బిజినెస్‌ అనలిస్ట్‌– 01 ఈ భాగాలను ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ ని బట్టి డిగ్రీ, బీటెక్ వంటి వివిధ విద్యార్హతలు ఉంటాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జులై 23 2021 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు 6 2021 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించి తెలుసుకోగలరు.https://ntpc.co.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment