Viral Video: బాతు పిల్లలతో స్నేహం చేస్తున్న కోతి.. వీటి స్నేహానికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

July 29, 2021 8:16 PM

Viral Video: సాధారణంగా కొన్ని జంతువులు పక్షుల మధ్య విపరీతమైన వైరం ఉంటుంది. అయితే కొన్నిసార్లు అవి వాటి మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరచి ఎంతో స్నేహంగా మెలిగి ఉండటం చూస్తే చూడటానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక కోతి పిల్ల బాతు పిల్లలతో కలిసి ఎంతో సరదాగా స్నేహం చేస్తూ ఆడుకుంటుంది. బాతు పిల్లలు కూడా కోతితో ఎంతో చిలిపిగా ఆడుతూ.. దానిపైనే నిద్రపోతూ ఎంతో స్నేహంగా మెలగుతున్నాయి.ఈ విధంగా ఇవి వాటి మధ్య ఉన్న వైరం మరిచి స్నేహంగా మెలగడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లు ఫిదా చేస్తోంది.

ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోతి పేరు  ‘బీబీ’ . యానిమల్ హౌస్ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ కోతి నెటిజనులకు పరిచయమే. ఈ వీడియోలో ఉన్నటువంటి బాతుపిల్లల తల్లి కోతికి మాత్రమే కాకుండా మరో కుక్కకి కూడా మంచి స్నేహితురాలు. ఈ మూడు కలిసి వాటి మధ్య ఉన్న శత్రుత్వాన్ని మర్చిపోయి ఎంతో సరదాగా కలిసి ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ బాతు పిల్లలు కూడా కోతితో సరదాగా ఉన్నటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment