BSNL 5G : BSNL వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. 5జి వ‌చ్చేస్తోంది..!

January 15, 2026 9:13 PM

BSNL 5G : మీరు ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన BSNL సిమ్ వాడుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వ‌ర‌లోనే మీకు 5జి సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. అవును, నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు. దేశంలో ప్ర‌స్తుతం BSNLకు గాను కేవ‌లం 3జి సేవ‌లు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్ర‌మే 4జి ప‌నిచేస్తోంది. అయితే 4జి కాకుండా ఏకంగా నేరుగా 5జి సేవ‌ల‌నే అందుబాటులోకి తెచ్చేందుకు BSNL కృషి చేస్తోంది. ఈ మేరకు BSNL స‌న్నాహాలు ప్రారంభించింది.

BSNL త్వ‌ర‌లోనే జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా కంపెనీల‌కు త‌న 5జి సేవ‌ల ద్వారా పోటీ ఇవ్వ‌నుంది. హైస్పీడ్ డేటాతోపాటు హెచ్‌డీ క్లారిటీతో వాయిస్ కాల్స్‌ను చేసుకునే సౌక‌ర్యాన్ని కూడా అందుబాటులోకి తేనుంది. ఇక 5జి సేవ‌ల‌ను అందించేందుకు గాను BSNL ప‌లు స్టార్ట‌ప్‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో కొన్ని చోట్ల 5జి ట్ర‌య‌ల్ ర‌న్ కూడా నిర్వ‌హించ‌నున్నారు. అందుకు గాను కొన్ని ప్రాంతాల‌ను ఇప్ప‌టికే ఎంపిక చేశారు. ఈ క్ర‌మంలో ఈ ట్ర‌య‌ల్ ర‌న్‌లో భాగంగా 700మెగా హెడ్జ్ బ్యాండ్ కింద 5జి సేవ‌ల‌ను BSNL అందిస్తుంది.

BSNL 5G services company will give trial run very soon
BSNL 5G

ఇక ఈ ట్ర‌య‌ల్ ర‌న్‌ను ఢిల్లీలోని క‌న్నాట్ ప్లేస్‌, బెంగ‌ళూరులోని ప్ర‌భుత్వ ఇండోర్ కార్యాల‌యం, ఢిల్లీలోని సంచార్ భ‌వ‌న్‌, జేఎన్‌యూ క్యాంప‌స్‌, ఐఐటీ, ఇండియా హాబిటాట్ సెంట‌ర్‌, గురుగ్రామ్‌లోని ఒక చోట‌, హైద‌రాబాద్‌లోని ఐఐటీ త‌దిత‌ర ప్ర‌దేశాల్లో నిర్వ‌హిస్తారు. ఈ ప్ర‌దేశాల్లోని వినియోగ‌దారుల‌కు ముందుగా BSNL5జి సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయి. త‌రువాత దేశ‌వ్యాప్తంగా ఈ సేవ‌ల‌ను విస్త‌రిస్తారు.

అయితే BSNL గ‌నక అనుకున్న ప్ర‌కారం 5జి ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హించి విజ‌య‌వంతం అయితే ఈ ఏడాది చివ‌రి నుంచే దేశీయ BSNL వినియోగ‌దారుల‌కు 5జి సేవ‌లు ల‌భ్యం అవుతాయి. దీంతో ఇత‌ర కంపెనీల‌తో పోలిస్తే త‌క్కువ ధ‌ర‌లకే వినియోగ‌దారులు డేటా, వాయిస్ కాల్స్ సౌక‌ర్యాన్ని, వాలిడిటీని పొందుతారు. మ‌రి దేశ‌వ్యాప్తంగా BSNLలో 5జి సేవ‌లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now