Skin Problems : వ‌ర్షాకాలంలో వ‌చ్చే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు ఇలా చెక్ పెట్టండి..!

January 15, 2026 9:13 PM

Skin Problems : వ‌ర్షాకాలంలో చాలా మందికి చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో కురుపులు, మొటిమ‌లు, దుర‌ద‌లు కూడా ఉంటాయి. ముఖ్యంగా చిన్నారులు మురికి నీటిలో ఎక్కువ‌గా ఆడుతారు. క‌నుక వారికే ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే బ్యాక్టీరియా వ‌ల్ల కూడా చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. దీంతోపాటు కొంద‌రికి ఈ సీజ‌న్‌లో మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి. అయితే ప‌లు స‌హ‌జ‌సిద్ద‌మైన చిట్కాల‌ను పాటించ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేప ఆకులు లేదా బెర‌డు, వేప పండ్లు మ‌న‌కు వ‌ర్షాకాలంలో వ‌చ్చే చ‌ర్మ స‌మ‌స్య‌లను త‌గ్గించ‌డంలో ఎంత‌గానో ప‌నిచేస్తాయి. కురుపులు, మొటిమ‌లు ఉంటే వేపాకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని చ‌ల్లార్చి దాంతో త‌ల‌స్నానం చేయాలి. దీంతో ఇన్ఫెక్ష‌న్లు రావు. అలాగే వేపాకుల‌ను పేస్ట్‌లా చేసి శరీరానికి ప‌ట్టించి కాసేపు అయ్యాక స్నానం చేయ‌వ‌చ్చు. ఇలా చేసినా కూడా ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

follow these natural tips for Skin Problems in monsoon
Skin Problems

ఇక చాలా మంది ఇళ్ల‌లో తుల‌సి మొక్క ఉంటుంది. ఇందులో ఎన్నో ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. తుల‌సి మ‌న‌ల్ని చ‌ర్మ వ్యాధుల నుంచి ర‌క్షిస్తుంది. తుల‌సి ఆకుల ర‌సాన్నిశ‌రీరానికి అప్లై చేయ‌వ‌చ్చు. దీంతో కురుపులు, మొటిమ‌లు, ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో క‌ల‌బంద కూడా ప‌నిచేస్తుంది. క‌లబంద గుజ్జును కూడా చ‌ర్మానికి రాయ‌వ‌చ్చు. దీంతోపాటు త‌మ‌ల‌పాకులు కూడా చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిని పేస్టులా చేసి చ‌ర్మానికి రాసుకుంటే ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గ‌డ‌మే కాదు, మొటిమ‌లు, మ‌చ్చ‌ల నుంచి కూడా విముక్తి ల‌భిస్తుంది. ఇలా ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటించ‌డం ద్వారా వ‌ర్షాకాలంలో వ‌చ్చే చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now