Sitting In Temple : ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కాసేపు అందులో కూర్చోవాలి.. ఎందుకంటే..?

May 17, 2024 3:11 PM

Sitting In Temple : మన దేశంలో ప్రతి ఇంట్లోనూ దేవుడికి చిన్నపాటి గుడి అయినా కచ్చితంగా ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉన్నా సరే దేవుడికి మాత్రం ఓ రూమ్ కేటాయిస్తాం. ప్రతి రోజూ దేవుడిని తలచుకోనిదే ఏ పని చేయని వారు కూడా ఉంటారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద బిజినెస్ లు చేస్తున్నా.. ఎంత బిజీగా ఉన్నా సరే వారంలో ఒక్కసారైనా గుడులకు వెళ్తుంటారు జనాలు. కొందరు ప్రత్యేక పూజలు చేయిస్తారు. మరికొందరు హోమాలు, యాగాలు లాంటివి కూడా చేస్తారు. కష్టం వచ్చిన ప్రతి సారీ దేవుడిని నమ్ముకుని ముందుకు వెళ్తుంటారు. ఇక గుడికి వెళ్లడాన్ని పవిత్ర కార్యంగా చూస్తారు.

తాము అనుకున్న పనులు సవ్యంగా జరగాలని దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు చేయించేవారు ఎంతోమంది ఉంటారు. అయితే ఇలా గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తమ మొక్కులు చెల్లించుకుని, దేవుడి దర్శనం అయిన తర్వాత కచ్చితంగా గుడిలో కాసేపు కూర్చుంటారు. గుడిలో ప్లేస్ లేకపోతే కనీసం గుడి ఆవరణలో అయినా సరే కాసేపు కూర్చుంటారు. ఇది తరతారాల నుంచి ఆచారంగా వస్తోంది. కానీ ఇలా గుడిలో ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. కానీ పెద్ద వారి నుంచి చిన్న వయసు వారి దాకా అందరూ ఇలా గుడిలో కాసేపు కూర్చుని సేద తీరుతారు.

Sitting In Temple after darshan why it is mandatory
Sitting In Temple

అయితే ఇలా గుడిలో కూర్చోవడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. ఇలా గుడిలో కూర్చేంటే అనేక లాభాలు ఉన్నాయి. భగవంతుడి దర్శనంతో మన మనసు, శరీరం ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన దేహం ఎంతో ఉత్తేజభరితంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సరైన మోతాదులో జరుగుతుంది. గుడిలో కాసేపు కూర్చుంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణం మనలోని అలజడిని దూరం చేస్తుంది. అంతే కాకుండా గుడిలో పంతులు చదివే మంత్రాలు మన ఆలోచనలను ఉత్తేజపరుస్తాయి.

ఇంకో విషయం ఏంటంటే.. ఆలయాల నిర్మాణశైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి దోహదపడుతుంది. గుడి పరిసరాల్లో అస్కాయంత శక్తి తరంగాల పరిధి చాలా ఎక్కువగా ఉండేలా నిర్మిస్తారు. దాని వల్ల మన బాడీకి పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది. మనసులో చెడు ఆలోచనలు రావు. అంతే కాకుండా మనం ఏ కోరికలతో గుడికి వస్తామో అవి మనమే నెరవేర్చుకునేంత పాజిటివ్ నెస్ మనలో స్పష్టంగా పెరుగుతుంది.

అందుకే ఈ గుడి ప్రదేశ కేంద్ర స్థానంలో మూల విరాట్​ను ప్రతిష్ట చేస్తారట. కాబట్టి దేవుడి దర్శనం అయిన తర్వాత కొద్దిసేపు ఆలయంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కాకపోతే వీటి గురించి మనకు తెలియకపోయినా గుడిలో కాసేపు కూర్చుని మన మనసుకు ప్రశాంతతను పొందుతున్నాం. కాబట్టి మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే కచ్చితంగా గుడిలో కూర్చోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now