Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఎంతో టేస్టీ అయిన ఐస్‌క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

May 15, 2024 9:08 AM

Mango Ice Cream : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నకు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తుంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో మ‌నం ప‌లు ర‌కాల పిండి వంట‌లు, జ్యూస్‌ల‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఇవి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే మామిడి పండ్ల‌తో చేసే ఐస్‌క్రీమ్‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కాస్త శ్ర‌మిస్తే మ‌నం ఇంట్లోనే వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని ఎలా చేయాలో, వీటి త‌యారీకి ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాంగో ఐస్‌క్రీమ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిక్క‌ని క్రీమ్ – 2 క‌ప్పులు, చ‌క్కెర పొడి – అర క‌ప్పు, మామిడి పండు గుజ్జు – ముప్పావు క‌ప్పు, ఎల్ల ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, టూటీ ఫ్రూటీ ప‌లుకులు – కొన్ని.

Mango Ice Cream recipe make in this way very easy method
Mango Ice Cream

మ్యాంగో ఐస్‌క్రీమ్‌ను త‌యారు చేసే విధానం..

ఒక గిన్నెలో క్రీమ్‌, చ‌క్కెర పొడి వేసుకుని క‌నీసం 5 నిమిషాల‌పాటు గిల‌కొట్టుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసుకుని మ‌ళ్లీ గిల‌కొట్టుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్ర‌మాన్ని చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. క‌నీసం 6 నుంచి 7 గంట‌ల‌పాటు ఫ్రిజ్‌లో పెడితే చాలు, ఐస్ క్రీమ్ రెడీ అయిన‌ట్లే. దీన్ని త‌రువాత తీసి తినేయ‌డ‌మే. ఇలా త‌యారు చేసిన ఐస్‌క్రీమ్‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now