LPG Gas Cylinder Rules : త్వ‌ర‌లో మారనున్న గ్యాస్ సిలిండ‌ర్ నిబంధ‌న‌లు..?

May 11, 2024 2:16 PM

LPG Gas Cylinder Rules : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా నూత‌న ప‌థ‌కాల‌ను అంద‌జేస్తున్నారు. దీంతో వంట గ్యాస్ వినియోగం పెరిగింది. ఇక దేశంలో ప్ర‌స్తుతం వంట గ్యాస్ వినియోగ‌దారుల సంఖ్య 14.45 కోట్లు ఉండ‌గా, ఇందులో 10 కోట్ల మందికి పైగా స‌బ్సిడీని పొందుతున్నారు. అలాగే మ‌హిళ‌లు దీపం ప‌థ‌కం కింద గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఇక‌పై వంట గ్యాస్ సిలిండ‌ర్‌ల విష‌యంలో నిబంధ‌న‌ల‌ను మార్చ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు మేలు చేసేందుకే ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇక‌పై వంట గ్యాస్ సిలిండ‌ర్‌ను బుక్ చేయాలంటే అందుకు గాను వినియోగ‌దారుడు త‌న ఫింగ‌ర్ ప్రింట్ లేదా ఐరిస్ బ‌యోమెట్రిక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు గాను ముందుగా వినియోగ‌దారుడు త‌న‌కు ఉన్న సిలిండ‌ర్‌కు చెందిన గ్యాస్ ఏజెన్సీ వ‌ద్ద‌కు వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త‌రువాత నుంచి బ‌యోమెట్రిక్ వేసి సిలిండ‌ర్‌ను బుక్ చేయాలి. అయితే ఈ నిబంధ‌న వ‌ల్ల అక్ర‌మాల‌ను అడ్డుకోవ‌చ్చ‌ని, కేంద్రం ఇచ్చే ల‌బ్ధి నేరుగా ల‌బ్ధిదారుల‌కు చేరుతుంద‌ని అంటున్నారు. అయితే ఇది ప్ర‌స్తుతం ఉన్న వినియోగ‌దారుల‌కా లేక కొత్త వినియోగ‌దారుల‌కా అన్న విష‌యంలో మాత్రం ఇంకా స్ప‌ష్టత రాలేదు.

LPG Gas Cylinder Rules they may be changed very soon
LPG Gas Cylinder Rules

కాగా మ‌రోవైపు కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై క్ర‌మంగా స‌బ్సిడీని త‌గ్గిస్తూ వ‌స్తున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ప్ర‌స్తుతం గ్యాస్ వినియోగ‌దారుల‌కు కంపెనీని బ‌ట్టి కేవ‌లం రూ.30 నుంచి రూ.50 వ‌ర‌కు మాత్ర‌మే సిలిండ‌ర్‌పై స‌బ్సిడీని అందిస్తున్నారు. ఇక త్వ‌ర‌లోనూ దాన్ని కూడా ఎత్తేస్తార‌ని స‌మాచారం. ఆ త‌రువాత పేద‌ల‌కు మ‌రిన్ని ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల‌ను అందిస్తార‌ని తెలుస్తోంది. అయితే కేంద్రంలో మ‌ళ్లీ మోదీ ప్ర‌భుత్వం వ‌స్తేనే ఇలా జ‌రుగుతుంద‌ని, యూపీఏ వ‌స్తే నిబంధ‌న‌ల‌ను మ‌రోలా మార్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now