Ayodhya Ram Mandir : అయోధ్య రామ‌మందిరంలో భారీ మార్పులు.. ఏం జ‌రుగుతోంది..?

April 24, 2024 3:13 PM

Ayodhya Ram Mandir : రామ‌న‌వ‌మి త‌రువాత అయోధ్య‌లోని రామాలయంలో కొన్ని కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాస్త‌వానికి, ఆల‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక అంత‌స్తు మాత్ర‌మే సిద్దం చేయ‌గా, అక్క‌డ రెండవ అంత‌స్తు ఇంకా సిద్దం కాలేదు. ఆల‌యాన్ని ప్రారంభించిన‌ప్పుడు రామ్ లాలా విగ్ర‌హాన్ని మొద‌టి అంత‌స్తులోనే ఉంచారు. మొద‌టి అంతస్తుతో పాటు రెండో అంత‌స్తు ప‌నులు కూడా పూర్త‌య్యాయి. ఆల‌య ప్రాంగ‌ణం చుట్టూ 14 అడుగుల వెడ‌ల్పుతో భ‌ద్ర‌తా గోడ‌ను కూడా నిర్మించారు. ఇదొక్క‌టే కాదు కాంప్లెక్స్ మ‌రో 6 ఆల‌యాల‌ను నిర్మించ‌డానికి ప్ర‌ణాళిక‌లు కూడా జ‌రుగుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం రామ మందిర స‌ముదాయంలో మ‌రో 6 ఆల‌యాల‌ను నిర్మించ‌నున్నారు. ఒక మూల‌లో శివుని ఆల‌యం, మ‌రొక వైపు మా భ‌గ‌వ‌తి ఆల‌యం, మ‌రొక వైపు పార్వ‌తి ఆల‌యం, పూర్య భ‌గ‌వానుడి ఆల‌యం నిర్మించ‌నున్నారు. అలాగే రామ్ లాలా చేతుల‌కు ఒక‌వైపు హ‌నుమంతుడి ఆల‌యం మ‌రొక వైపు అన్న‌పూర్ణ ఆల‌యాల‌ను నిర్మించ‌నున్నారు. అంతేకాకుండా మ‌హ‌ర్షి వాల్మీకి, మ‌హ‌ర్షి వ‌శిష్ట‌, మ‌హ‌ర్షి విశ్వామిత్ర‌, మ‌హ‌ర్షి అగ‌స్త్య‌, నిషాద్ రాజ్, మాతా శ‌బ‌రి, మాతా అహ‌ల్య‌, జ‌టాయుల ఆలయాలు కూడా ఆల‌య స‌ముదాయంలో నిర్మించ‌బ‌డ‌తాయి. అంతేకాకుండా ఆల‌య ప్రాంగ‌ణాన్ని ఎండ త‌గ‌ల‌కుండా మార్చ‌నున్న‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో 25,000 మంది భ‌క్తులు ఏక‌కాలంలో ఆల‌యం లోప‌ల ఉండ‌గ‌ల‌రు.

Ayodhya Ram Mandir these new changes were made
Ayodhya Ram Mandir

అంతేకాదు, యాంత్రికుల వ‌స్తువులు ఆల‌యంలో ఉంచే సౌక‌ర్యం కూడా క‌ల్పిస్తారు. ఇక ఆల‌య ప్రాంగ‌ణంలో 600 మొక్క‌లు నాటారు. నీటిశుద్ది క‌ర్మాగారం మ‌రియు మురుగు నీటి శుద్ది ప్లాంట్ సౌక‌ర్యం కూడా ఉంది. ఇక రాంలాలా ఆల‌యాన్ని ప్రారంభించిన‌ప్ప‌టి నుండి 1.5 కోట్ల మంది ప్ర‌జ‌లు రాం లాలాను ద‌ర్శించుకున్నారు. రాంలాలా ద‌ర్శనం కోసం మ‌న దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా భ‌క్తులు వ‌స్తున్నారు. ప్ర‌తిరోజూ దాదాపు ఒక ల‌క్ష మంది భ‌క్తులు రాం లాలాను ద‌ర్శించుకోవ‌డానికి వ‌స్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now