గ్రేట్‌.. రోడ్డు ప‌క్క‌న షూ పాలిష్‌లు చేస్తూ నెల‌కు రూ.18 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు..!

July 25, 2021 2:44 PM

క‌ష్ట‌ప‌డి నిజాయితీగా ప‌నిచేయాలే గానీ ఏ ప‌ని అయినా చేయ‌వ‌చ్చు. అందులో మొహ‌మాట ప‌డాల్సిన ప‌నిలేదు. డిగ్నిటీ ఆఫ్ లేబ‌ర్ అంటే అదే. నిజాయితీగా ఉంటే ఏ ప‌నైనా చేయ‌వ‌చ్చు. అందులో సిగ్గు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అవును.. ఆ వ్య‌క్తి కూడా స‌రిగ్గా అలాగే భావించాడు. అందుక‌ని గ‌తంలో తాను ఫొటోగ్రాఫ‌ర్‌గా జీవితం గ‌డిపినా.. ఇప్పుడు అవ‌మానం అని భావించ‌కుండా రోడ్డు ప‌క్క‌న షూ పాలిష్‌లు చేస్తూ నెల‌కు ఏకంగా రూ.18 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. అత‌నే అమెరికాకు చెందిన డాన్ వార్డ్‌.

man earning rs 18 lakhs per month by shoe polishing

అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న మాన్‌హ‌ట్ట‌న్ అనే ఏరియాలో డాన్ వార్డ్ బాగా పాపుల‌ర్‌. అత‌ని వ‌ద్ద షూ పాలిష్ చేయించుకునేందుకు ఎంతో మంది లైన్‌లో నిలుచుని ఉంటారు. కార‌ణం.. డాన్ వార్డ్ చ‌తుర‌తే. ఎవ‌రైనా అత‌ని క‌ళ్ల ముందు మురికి ప‌ట్టిన షూస్ వేసుకుని పోతుంటే జోక్ వేసి పిలుస్తాడు. దానికి వారు స‌హ‌జంగానే ఆక‌ర్షితుల‌వుతారు. అలా వారు అత‌ని వ‌ద్ద‌కు వ‌చ్చి షూ పాలిష్ చేయించుకుని వెళ్తారు.

అయితే క‌స్ట‌మ‌ర్ల‌ను పిలిచేందుకే కాదు, వారి షూస్‌ల‌ను పాలిష్ చేసేట‌ప్పుడు కూడా డాన్ వార్డ్ వారితో చ‌నువుగా మాట్లాడుతూ జోక్స్ వేస్తుంటాడు. అందుక‌నే అత‌ని వ‌ద్ద చాలా మంది షూ పాలిష్ చేయించుకునేందుకు వ‌స్తుంటారు. అలా డాన్ వార్డ్ స‌క్సెస్ బాట ప‌ట్టాడు.

గ‌తంలో అత‌ను ఫోటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాడు. కానీ ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. దీంతో జాబ్ వ‌దిలేసి ఈ ప‌ని మొద‌లు పెట్టాడు. ఇందులో విజ‌యం సాధించాడు. అత‌ను ప్ర‌స్తుతం రోజుకు రూ.60వేల చొప్పున నెల‌కు రూ.18 ల‌క్ష‌ల‌ను సంపాదిస్తున్నాడు. అత‌న్ని చూసి కొంద‌రు అత‌ని స్నేహితులు కూడా చేస్తున్న ఉద్యోగాల‌ను మానేసి కొన్ని ప్రాంతాల్లో అత‌ని లాగే షూస్ ను పాలిష్ చేసి డ‌బ్బులు సంపాదించ‌డం మొద‌లు పెట్టారు. ఇంత సంపాదించినా త‌న‌కు ఉపాధిని అందించింది ఇదే క‌నుక డాన్ వార్డ్ ఈ వృత్తిలో కొన‌సాగ‌డం మాత్రం మాన‌లేదు. అవును.. శ్ర‌మ‌ను గుర్తించాడు, క‌నుక‌నే అందులో కొన‌సాగుతున్నాడు. ఏది ఏమైనా అత‌ను ఇంత‌లా విజ‌యం సాధించినందుకు అత‌న్ని అభినందించాల్సిందే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment