Vishalakshi Devi Temple In Kashi : కాశీలో ఉన్న ఈ అమ్మ‌వారి ఆల‌యం గురించి తెలుసా.. స‌క‌ల రోగాలు న‌య‌మ‌వుతాయి..

April 14, 2024 11:53 AM

Vishalakshi Devi Temple In Kashi : పురాత‌న మ‌రియు మ‌త‌ప‌ర‌మైన న‌గ‌రాల్లో కాశీ కూడా ఒక‌టి. కాశీ న‌గ‌రంలో అమ్మ‌వారి అధ్భుత‌మైన శ‌క్తిపీఠం ఉంది. ఇక్క‌డ శ‌క్తి పీఠాన్ని ద‌ర్శించుకుంటే భక్తుల కోరిక‌లన్నీ నెర‌వేరుతాయి. అటువంటి శ‌క్తి ఆరాధ‌న పీఠాలల్లో మాతా విశాలాక్షి ఆలయం కూడా ఒక‌టి. దేశ‌వ్యాప్తంగా న‌లుమూల‌ల నుండి ఇక్క‌డికి భ‌క్తులు వస్తూ ఉంటారు. పురాణాల ప్ర‌కారం శివుని భార్య స‌తీదేవి తండ్రి అయిన ద‌క్ష ప్ర‌జాప‌తి రాజ‌భ‌వ‌నంలో ఒక యాగంలో త‌న భ‌ర్త చేసిన అవ‌మానానికి బాధ‌ప‌డిన స‌తీదేవి అదే యాగ‌శాల‌లో త‌న శ‌రీరాన్ని వ‌దిలివేసింది. ఆ త‌ర్వాత శివుడు స‌తీదేవి మృత‌దేహంతో క‌ల్యాణాన్ని ప్రారంభించాడు. ఆ స‌మ‌యంలో సృష్టిని ర‌క్షించ‌డానికి శ్రీమ‌హావిష్ణువు సుద‌ర్శ‌న చ‌క్రంతో స‌తీదేవి శ‌రీరాన్ని ముక్క‌లుగా చేస్తాడు. స‌తీదేవి శ‌రీర భాగాలు ప‌డిన ప్రదేశాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు.

మొత్తం 51 శ‌క్తి పీఠాలు ప‌రిగ‌ణించ‌బ‌డ‌తాయి. ప‌ర‌మ‌శివుడు భుజంపై స‌తీదేవిని పెట్టుకుని తిరుగుతున్న‌ప్పుడు స‌తీదేవి కుడి చెవిపోగు, కుడి క‌న్ను ప‌డిన ప్రదేశ‌మే నేడు మాతా విశాలాక్షి యొక్క నివాసం కాశీగా ప్ర‌సిద్ది చెందింది. అలాగే ఈ శ‌క్తి పీఠాల‌న్నీ సంద‌ర్శించిన త‌రువాత శివుడు ధ్యానం చేసాడ‌ని అత‌ని రూపం నుండే కాల‌భైర‌వుడిని సృష్టించాడ‌ని న‌మ్ముతారు. కాశీలోని ఈ శ‌క్తి పీఠానికి ద‌గ్గ‌ర్లోనే కాల‌భైర‌వుడు కూడా ఉన్నాడు. కాశీలో అమ్మ‌వారైన‌టువంటి విశాలాక్షి దేవి శ‌క్తిపీఠం కాశీలోని వంక‌ర వీధుల మ‌ధ్య ఉంది. శివుడు రోజూ రాత్రి ఇక్క‌డే నిద్రిస్తాడ‌ని న‌మ్ముతారు. ఈ త‌ల్లి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటారు. ముఖ్యంగా న‌వ‌రాత్రుల్లో ఇక్క‌డ భ‌క్తుల ర‌ద్దీ మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. కాశీలో ఉన్న విశాలాక్షి దేవిని ద‌ర్శించుకోవ‌డం వ‌ల్ల రోగాలు, దుఃఖాలు దూర‌మ‌వుతాయ‌ని అలాగే సంతానం లేని వారికి సంతానం క‌లుగుతుంద‌ని న‌మ్ముతారు.

Vishalakshi Devi Temple In Kashi very powerful visit once to remove all bac luck
Vishalakshi Devi Temple In Kashi

అలాగే వివాహం కుద‌ర‌ని మ‌రియు వివాహంలో ఆటంకాలు ఉన్న అమ్మాయిలు వ‌రుస‌గా 41 రోజుల పాటు మాతా విశాలాక్షిని ద‌ర్శించుకోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు తొల‌గిపోయి వివాహం జ‌రుగుతుందని కూడా విశ్వ‌సిస్తారు. అలాగే ఇక్క‌డ మాతా విశాలాక్షి దేవి ఆల‌యం ద్రావిడ శైలిలో ఉంటుంది. ఈ ఆల‌యం ద‌క్షిణ భార‌త‌దేశంలో ఆల‌యాల‌ను పోలి ఉంటుంది. ఇక్క‌డ అమ్మ‌వారికి పూలమాల‌లు, పూలు, ప్ర‌సాదాలతో పాటు అలంక‌ర‌ణ వస్తువులు కూడా స‌మ‌ర్పిస్తూ ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now