Bell In Temple : దేవుడికి నైవేద్యం పెట్టేట‌ప్పుడు గంటను ఎన్ని సార్లు మోగించాలి..?

April 7, 2024 5:34 PM

Bell In Temple : హిందూ పూజా విధానంలో పూజ స‌మ‌యంలో గంటకొట్ట‌డాన్ని ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. గంట లేకుండా పూజ సంపూర్ణంగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌దు. ఇల్లు అయినా, గుడి అయినా పూజ చేసేట‌ప్పుడు గంట కొట్టాల్సిందే. అలాగే పూజ స‌మ‌యంలోనే కాకుండా భ‌గ‌వంతునికి నైవేద్యం స‌మ‌ర్పించే స‌మయంలో కూడా గంట కొడ‌తారు. ఇది మ‌నందరికి తెలిసిందే. అయితే నైవేద్యం స‌మ‌ర్పించేట‌ప్పుడు గంట ఎందుకు కొడ‌తారు.. గంట కొట్టేట‌ప్పుడు పాటించాల్సిన నియామాలు ఏమిటి.. దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ ధ‌ర్మ‌శాస్త్రం ప్రకారం, గాలి మూల‌కాల‌ను మేల్కొల్ప‌డానికి గంట‌నే మోగిస్తారు. గాలిలో వాయు, స‌మాన వాయు, అపాన వాయు, ఉదాన వాయు, ప్రాణ వాయు అనే 5 మూల‌కాలు ఉంటాయి. భ‌గ‌వంతునికి నైవేధ్యం స‌మ‌ర్పించేట‌ప్పుడు 5 సార్లు గంట కొట్ట‌డం వ‌ల్ల ఈ 5 మూల‌కాలు మేల్కొంటాయి. ఈ మూల‌కాల ద్వారా భ‌గ‌వంతుడు నైవేధ్యాన్ని స్వీక‌రిస్తాడ‌ని విశ్వ‌సిస్తారు. అలాగే భ‌గ‌వంతుడికి నైవేద్యం స‌మ‌ర్పించేట‌ప్పుడు కొన్ని నియ‌మాల‌ను త‌ప్ప‌కుండా పాటించాలి. నైవేద్యాన్ని ఎప్పుడూ త‌మ‌ల‌పాకులో ఉంచి దేవుడికి స‌మ‌ర్పించాలి. త‌మ‌ల‌పాకు దేవ‌త‌ల‌కు ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ది.

Bell In Temple how many times we have to ring it
Bell In Temple

స‌ముద్ర మ‌థ‌నం స‌మ‌యంలో అమృతం చుక్క నుండి త‌మ‌ల‌పాకు ఉద్భ‌వించింద‌ని, అందుకే తమ‌ల‌పాకు దేవ‌త‌ల‌కు చాలా ప్రీతిక‌ర‌మైన‌ద‌ని పండితులు చెబుతున్నారు. అలాగే భ‌గ‌వంతునికి నైవేద్యం స‌మ‌ర్పించేట‌ప్పుడు 5 సార్లు గంట కొట్ట‌డంతో పాటు ఈ 5 మంత్రాల‌ను కూడా చ‌ద‌వాలి. ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం స‌మానాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, అనే మంత్రాల‌ను జ‌పించిన త‌రువాత చేతిలోకి నీటిని తీసుకుని ప్ర‌సాదం చుట్టూ తిప్పి, భూమిపై నీటిని వ‌ద‌లాలి. ఈ విధంగా భ‌గ‌వంతునికి నైవేద్యం స‌మ‌ర్పించాలని అప్పుడే మ‌న‌కు పుణ్య ఫ‌లాలు ల‌భిస్తాయ‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now