Anant Ambani Fitness Trainer Fees : అనంత్ అంబానీని బ‌రువు త‌గ్గించేందుకు ఈ ఫిట్‌నెస్ ట్రెయిన‌ర్ తీసుకున్న మొత్తం ఎంతో తెలుసా..?

March 4, 2024 6:38 PM

Anant Ambani Fitness Trainer Fees : దేశ‌మంత‌టా ఇప్పుడు ఎక్క‌డ చూసినా అంబానీ కుటుంబంలో జ‌రుగుతున్న వివాహ వేడుక‌పైనే చ‌ర్చంతా న‌డుస్తోంది. ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి జ‌రుగుతున్న పెళ్లి వేడుక‌కు అతిర‌థ మ‌హార‌థులు త‌ర‌లివ‌స్తున్నారు. ఇప్ప‌టికే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తోపాటు ఫేస్‌బుక్ య‌జ‌మాని మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కూడా హాజ‌ర‌య్యారు. అలాగే హాలీవుడ్ పాప్ సింగ‌ర్ రిహాన్నా కూడా జామ్‌న‌గ‌ర్‌కు విచ్చేసింది. ఈ పెళ్లి వేడుక‌లో ఆమె త‌న ఆట‌పాట‌ల‌తో సంద‌డి చేయ‌నుంది.

అయితే అనంత్ అంబానీ గ‌తంలో బాగా లావుగానే ఉండేవాడు. కానీ త‌రువాత ఏం జ‌రిగిందో తెలియ‌దు, ఉన్న‌ట్లుండి అత‌ను భారీగా బ‌రువు త‌గ్గి అంద‌రికీ షాకిచ్చాడు. అయితే మ‌ళ్లీ తిరిగి య‌థాత‌థ స్థితికి వ‌చ్చేశాడు. మ‌ళ్లీ బ‌రువు బాగానే పెరిగిపోయాడు. ఈ క్ర‌మంలోనే అత‌ని బ‌రువు గురించి చ‌ర్చ న‌డుస్తోంది. అత‌నికి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, బ‌హుశా త‌న జీన్స్ వ‌ల్లే ఇలా అత‌ను మళ్లీ బ‌రువు పెరిగి ఉండ‌వ‌చ్చ‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

Anant Ambani Fitness Trainer Fees know how much he charges
Anant Ambani Fitness Trainer Fees

ఇక అనంత్ అంబానీ గ‌తంలో బ‌రువు త‌గ్గిన‌ప్పుడు అత‌ని ఫిట్‌నెస్ ట్రెయిన‌ర్ పేరు బాగా వినిపించింది. 2016లో అనంత్ అంబానీ సుమారుగా 18 నెల‌ల్లో 108 కిలోల బ‌రువు త‌గ్గాడు. అత‌ని ఫిట్‌నెస్ ట్రెయిన‌ర్ వినోద్ చ‌న్నా అత‌న్ని బ‌రువు త‌గ్గించేందుకు చాలా శ్ర‌మించాడ‌ట‌. క‌చ్చిత‌మైన డైట్‌తోపాటు వ్యాయామం కూడా చేయించాడ‌ట‌. అందువ‌ల్లే అప్ప‌ట్లో అనంత్ అంబానీ బ‌రువు త‌గ్గాడు. కానీ అత‌ను మ‌ళ్లీ బ‌రువు ఎలా పెరిగాడ‌నేది ఎవ‌రికీ అర్థం కాని విష‌యం.

కాగా వినోద్ చ‌న్నా బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు కూడా ఫిట్‌నెస్ ట్రెయిన‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. అత‌ను అనంత్ అంబానీకి హైప్రోటీన్‌, లో కార్బొహైడ్రేట్స్ డైట్‌ను సూచించాడ‌ట‌. అలాగే రోజువారీ ఆహారంలో ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గానే తీసుకునేలా డైట్ ప్లాన్ చేశాడ‌ట‌. ఇక వినోద్ చ‌న్నా మొత్తం 12 సెష‌న్ల‌కు రూ.1.50 ల‌క్ష‌లు తీసుకుంటాడ‌ని స‌మాచారం. ఒక్కో సెష‌న్‌కు ఇంట్లో అయితే రూ.3.50 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్షల వ‌ర‌కు అత‌ను చార్జ్ చేస్తాడ‌ట‌. అయితే అనంత్ అంబానీ కూడా వినోద్ ద‌గ్గ‌ర కొంత‌కాలం బ‌రువు త‌గ్గేందుకు సెష‌న్ల‌లో పాల్గొని అందులో విజ‌యం సాధించాక‌, వినోద్‌ను వ‌ద్ద‌ని అనుకుని ఉంటాడు. త‌రువాత మ‌ళ్లీ య‌థావిధిగా అనంత్ అంబానీ బ‌రువు పెరిగి ఉంటాడ‌ని అనుకుంటున్నారు. ఏది ఏమైనా అనంత్ అంబానీ వివాహం మాత్రం న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న చందంగా జ‌రుగుతుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now