Bobbara Vadalu : బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఒక్క‌టి కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం లాగించేస్తారు..!

January 25, 2024 11:55 AM

Bobbara Vadalu : పిల్లలు స‌హ‌జంగానే ఇండ్ల‌లో తినే ప‌దార్థాల కోసం చూస్తుంటారు. అస‌లే బ‌య‌ట ప‌దార్థాల‌ను తిన‌లేం క‌నుక పిల్ల‌లు సాధార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా.. త‌మ త‌మ ఇండ్ల‌లో ఉండే తినుబండారాల‌ను తినేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌లు కూడా వారికి సాంప్ర‌దాయ తినుబండారాల‌ను చేసి పెట్టాల‌ని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒక‌టి బొబ్బ‌ర్ల వ‌డ‌లు. వీటిని చాలా త్వ‌ర‌గా చేసుకోవ‌చ్చు. అలాగే పిల్ల‌ల‌కు మంచి రుచిగా కూడా ఇవి ఉంటాయి. ఈ క్ర‌మంలో బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొబ్బర్లు – 2 కప్పులు, పచ్చిమిర్చి – 4, అల్లం – చిన్నముక్క, జీలకర్ర – 1 టీస్పూన్, కొత్తిమీర – 1/4 కప్పు, కరివేపాకు – 1/4 కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా.

Bobbara Vadalu recipe in telugu make in this way
Bobbara Vadalu

బొబ్బ‌ర్ల వ‌డ‌ల‌ను తయారుచేసే విధానం..

బొబ్బర్లను 6 గంటల పాటు బాగా నానబెట్టాలి. అవి నానాక నీళ్లు పార‌బోసి మిక్సీలో అల్లం, పచ్చిమిర్చి, బొబ్బర్లు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. మెత్తగా రుబ్బితే వ‌డ‌లు స్మూత్ గా వ‌స్తాయి. అది వద్ద‌నుకుంటే ఆ మిశ్ర‌మాన్ని క‌చ్చా ప‌చ్చాగానే రుబ్బాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని గిన్నెలోకి తీసుకుని కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలిపి వడల్లా గుండ్రంగా చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి. దీంతో ఘుమ ఘుమ లాడే బొబ్బ‌ర్ల వ‌డ‌లు రెడీ అవుతాయి. వీటిని అలాగే తిన‌వ‌చ్చు. లేదా కొబ్బ‌రి, ట‌మాటా, ప‌ల్లి చ‌ట్నీలో తిన‌వ‌చ్చు. ఇలా తింటుంటే ఎంతో రుచిగా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now