Papaya For Liver Clean : లివ‌ర్ క్లీన్ అవ్వాల‌ని అనుకుంటున్నారా.. అయితే రోజూ బొప్పాయి తినండి..!

January 20, 2024 8:03 PM

Papaya For Liver Clean : బొప్పాయి పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో ఏ సీజ‌న్‌లో అయినా ల‌భిస్తాయి. వీటి రుచి తీపి, పులుపు క‌ల‌బోత‌గా ఉంటుంది. కొన్ని సార్లు బాగా పండిన బొప్పాయి పండ్లు చాలా తియ్య‌గా ఉంటాయి. అయితే వీటిని ఎవ‌రైనా తిన‌వ‌చ్చ‌చు. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లివ‌ర్ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డేవారు త‌ర‌చూ బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది. లివ‌ర్‌లో ఉండే చెడు, విష పదార్థాలు బ‌య‌ట‌కుపోయి లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను తింటుంటే ఫ‌లితం ఉంటుంది. బొప్పాయి పండ్ల‌లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. అలాగే వీటిలో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

Papaya For Liver Clean take daily for many benefits
Papaya For Liver Clean

బొప్పాయి పండ్ల‌లో విట‌మిన్ బి1, బి2, నియాసిన్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల నీర‌సం అధికంగా ఉండేవారు ఈ పండ్ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు. మూత్ర స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ బొప్పాయి పండ్ల‌ను తింటే మూత్రాశ‌యం శుద్ధి అవుతుంది. మూత్రం ధారాళంగా వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now