Cucumber Smoothie : కీర‌దోస‌తో స్మూతీని ఇలా చేయండి.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

January 19, 2024 4:11 PM

Cucumber Smoothie : వేస‌వి కాలంలో ఎవ‌రైనా స‌రే.. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు శీత‌ల పానీయాల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. అయితే శీత‌ల పానీయాల్లో కూల్‌డ్రింక్‌లు కాకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన పానీయాలు అయితే చాలా మంచిది. ఎందుకంటే.. కూల్‌డ్రింక్స్ అయితే మ‌న‌కు ఎలాంటి పోష‌కాల‌ను అందివ్వ‌వు. అలాగే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌వు. కానీ స‌హజ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేయ‌బ‌డిన పానీయాలు అయితే మ‌న‌కు అటు పోష‌ణ‌, ఇటు చ‌ల్ల‌ద‌నం రెండూ ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరానికి ఇలా రెండు విధాలుగా మేలు చేసే పానీయాల్లో కీర‌దోస స్మూతీ కూడా ఒక‌టి. దీన్ని వేస‌విలో తాగితే మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. వేడి శ‌రీరం ఉన్న‌వారు ఈ స్మూతీని ఎప్పుడైనా స‌రే తాగ‌వ‌చ్చు. అలాగే ప‌లు పోష‌కాలు కూడా అందుతాయి. మ‌రి కీర‌దోస స్మూతీ ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

కీరదోస స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చ‌ల్ల‌ని పెరుగు – 270 గ్రాములు, కీర‌దోస పేస్ట్ – 200 గ్రాములు, క‌ట్ చేసిన ట‌మాటాలు – 10 గ్రాములు, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – త‌గినంత.

Cucumber Smoothie recipe make in this way for taste and health
Cucumber Smoothie

కీర‌దోస స్మూతీ త‌యారు చేసే విధానం..

పైన చెప్పిన అన్ని ప‌దార్థాల‌ను బాగా క‌లిపి మిక్సీ ప‌ట్టాలి. జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి. అవ‌స‌రం అనుకుంటే కొంత నీరు క‌ల‌ప‌వ‌చ్చు. దీంతో కీర‌దోస స్మూతీ త‌యార‌వుతుంది. ఉప్పు, మిరియాల పొడిల‌ను టేస్ట్‌కు స‌రిప‌డా క‌లుపుకుంటే చాలు.. చ‌ల్ల చ‌ల్ల‌ని కీర‌దోస స్మూతీ రెడీ అయిన‌ట్టే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now