Rudraksha : మీ పేరును బ‌ట్టి ఎలాంటి రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే మంచిదో తెలుసుకోండి..!

January 10, 2024 4:36 PM

Rudraksha : రుద్రాక్ష.. సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. రుద్రాక్ష ధారణ అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత విశేషంగా భావిస్తారు. రుద్రాక్షలు అనేక రకాలు. ఏకముఖి నుంచి ఇరవై రకాలు వరకు ఉంటాయి. అయితే ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలో తెలుసుకుందాం. పండితులు, జ్యోతిషులు చెప్పిన వివరాలను తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం మనం జ్యోతిష్యంలో వాడేవి 27 ప్రధానంగా చెప్తారు. వాటి ప్రకారం 12 రాశులు. ఈ నక్షత్రాల ప్రకారం ఒక్కో నక్షత్రం నాలుగుపాదాలు. వాటిని బట్టి పేర్లు పెట్టుకుంటాం వాటి ప్రకారం..

చూ, చే, చో, ల, లీ, లూ, లే, లో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు మూడుముఖాల రుద్రాక్ష గాని, 1, 3,5 ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును. అదేవిధంగా ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వే, వో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు ఆరు ముఖాల రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలు థరించాలి. హి, హు, హె, హూ, డా, డి, డూ, డే, డో, ప్రథమ నామాక్ష్రాలు ఉన్న వారు ద్విముఖి రుధ్రాక్ష గాని , 2, 3, 5 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ గాని ధరించ వచ్చును. కా, కి, కూ, ఖం, ఙ, ఛ, కే, కో, హా ప్రథమ నామాక్షరలు ఉన్న వారు నాలుగు ముఖాల రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును.

Rudraksha know which one have to wear for luck
Rudraksha

మా, మీ, మూ, మే, మో, టా, టి, టు, టే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, ఏకముఖి గాని, 1, 3, 5ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ ధ‌రించ వచ్చును. రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే ,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, తులా లగ్నం వారికి, రాశి వారికి, భరణి, పుబ్బ, పూర్వషాడ,నక్షత్రాల వారికి 6 ముఖాల రుధ్రాక్ష గాని ,4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ ధ‌రించ వచ్చును. టో, పా ,పి, పూ, ష, ణ, ఢ, పె, పో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కన్య లగ్నం వారికి, రాశి వారికి, ఆశ్లేష, జ్యేష్ట, రేవతి, నక్షత్రాల వారికి 4 ముఖాల రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ ధ‌రించ వచ్చును. తో, నా, నీ, నూ, నే, నో, య, యి, యు, ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి మూడు ముఖాల రుధ్రాక్ష గాని, 2, 3, 5 ముఖాల రుధ్రాక్షలను కవచంలాగ ధ‌రించ వచ్చును.

యే, యో, బా, బి, బు, ధ, భ, ఢ, బే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు పంచముఖి రుధ్రాక్ష గాని 1, 3, 5 ముఖాల రుద్రాక్షలను కవచం లాగ ధ‌రించ వచ్చును. బో, జా, జి, జు, జే, జో, ఖా, గ, గి ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు సప్తముఖి రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ ధ‌రించాలి. గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కుంభ సప్తముఖాల రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించాలి. ద, దు, శ్యం, ఝ, ద, దే, దో, చా, చి, నామాక్షరాలు ఉన్న వారికి, పంచముఖాల రుధ్రాక్షని, 2, 3, 5 ముఖాలు ఉన్న రుధ్రాక్షలను కవచం లాగ ధరించాలి. పైన చెప్పినట్లుగా ఆయా రుద్రాక్షలను వాడితే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రుద్రాక్షలను ధరించినప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీఘ్రంగా సత్పలితాలు వస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now