Telugu Horror Movies : చేత‌బ‌డి బాగానే వ‌ర్క‌వుట్ అయింది..100 కోట్లు రాబ‌ట్టిన సినిమాలేంటో తెలుసా..?

January 1, 2024 9:36 PM

Telugu Horror Movies : టాలీవుడ్‌లో చేత‌బ‌డి జాన‌ర్ బాగా వర్క‌వుట్ అయింది. ఆ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల‌న్నీ కూడా మంచి విజ‌యం సాధించాయి. ఆ జాబితాలో చూస్తే.. కొన్ని పిక్స్ వంద కోట్ల వ‌సూళ్లు సాధించ‌డంతో పాటు ప్రేక్ష‌కుల‌ని అల‌రించాయి. మూస ఫార్ములాకి భిన్నంగా ఉన్న సినిమాలతో విసిగిపోతున్న ప్రేక్ష‌కుల‌కి చేత‌బ‌డి నేప‌థ్యంలో రూపొందిన సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించాయి. అంతేకాదు ఈ చిత్రాలు తెలుగులో 2023లో వంద కోట్లు దాటింది. చేత‌బ‌డి నేప‌థ్యంలో రూపొందిన మసూద, విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, పిండం, మంగళవారం సినిమాలు ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి.

‘మా ఊరి పొలిమేర 2’ చేతబడి కథతో రూపొంద‌గా, ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ‘మా ఊరి పొలిమేర 1’ ఓటీటీలో విడుదలై హిట్టవడంతో, ‘2’ కూడా తీస్తే హిట్టయ్యింది. ‘మసూద’, ‘విరూపాక్ష’ చేతబడి సినిమాలని హిట్ చేసిన ప్రేక్షకులు ఈ సినిమానీ హిట్ చేశారు. దెయ్యాల‌కి బ‌దులు చేత‌బ‌డి జోడించి ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదం పంచే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక రీసెంట్‌గా అజయ్ భూపతి దర్శకత్వంలో ట్రెండింగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన ఈ మూవీ మంగ‌ళ‌వారం చిత్రం కూడా మంచి విజ‌యం సాధించింది. నింఫోమేనియాక్ పాత్ర కథ. ఇలాటిది తెలుగులో ఇంతవరకూ రాలేదు. దీనికి గ్రామదేవత కథ జోడించారు.

Telugu Horror Movies these got good collections
Telugu Horror Movies

అలాగే ‘కాంతారా’ హిట్టయినప్పట్నుంచీ గ్రామ దేవతలు సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. దీన్ని లాజికల్ సస్పెన్సు తో క్రైమ్ థ్రిల్లర్ గా బాగానే తీస్తున్నారు. ఈ సినిమాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచాయి. వైవిధ్య‌మైన క‌థ‌తో ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. మొత్తానికి ఈ ఏడాది మాత్రం ప్రేక్ష‌కుల‌ని ఎన్నో చేతబ‌డి చిత్రాలు మంచి వినోదాన్ని పంచ‌డ‌మే కాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now