Anchor Sowmya Rao : సౌమ్య‌రావుని జ‌బ‌ర్ధ‌స్త్ నుండి మ‌ల్లెమాల వారే తొల‌గించారా.. తెర వెనుక జరిగింది ఇదే..!

December 31, 2023 3:26 PM

Anchor Sowmya Rao : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జబర్దస్త్ షో కి యాంకర్లుగా కేవలం రష్మి, అనసూయని మాత్రమే, మిగతా వాళ్ళని ఆ ప్లేస్ లో కనీసం ఊహించుకోలేకపోయారు ప్రేక్షకులు. అంతగా ఆ షో ని రక్తి కట్టించారు అనసూయ, రష్మి. అయితే అనుకోని కారణాల వలన వాళ్ళు ఇద్దరు జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడం వలన కొత్తగా ఆ స్థానంలోకి వచ్చింది కన్నడ నటి సౌమ్య రావు.ఈమె అనసూయ రేంజ్ లో ఆమె షో ని హ్యాండిల్ చేయగలదా అని అనుమానపడ్డారు. అయితే అందరి నమ్మకాలని వొమ్ము చేస్తూ తనదైన పంచులతో వచ్చిరాని తెలుగుతో షోని బాగానే న‌డిపించింది.

జబర్దస్త్ కమెడియన్ పంచులకి ఏమాత్రం తీసిపోని పంచులు వేస్తూ వాళ్లతో కలిసిపోయి తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే సడన్ గా ఈ మధ్య జబర్దస్త్ షోలో కనిపించకుండా పోయింది. ఎందుకో సడెన్ గా జబర్థస్త్ నుంచి సైలెంట్ గా తప్పుకుంది సౌమ్య రావు. అయితే ఆమె తప్పుకుందా..? లేుక తప్పించారా అనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఏదో జరిగింది అన్నది మాత్రం వాస్తవం. సౌమ్య ప్లేస్లో ప్రస్తుతం జబర్థస్త్ ను బిగ్ బాస్ బ్యూటీ సిరీ హనుమంత్ యాంకరింగ్ చస్తోంది. ఈక్రమంతో తాను ఎందుకు జబర్థస్త్ ను వీడాను అనేదానిపై క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. ఎందుకు జబర్దస్త్ షోను వదిలి వెళ్లారు? అని నెటిజన్ అడిగితే.. దానికి సౌమ్య ఇచ్చిన రిప్లై ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. టైం వస్తుంది.. అప్పుడు అన్నీ చెప్తా.. థాంక్యూ సో మచ్ అని చెప్పింది.

Anchor Sowmya Rao this may be the reason for her jabardasth exit
Anchor Sowmya Rao

అయితే సౌమ్య‌రావు వ‌చ్చాక‌ యాంకరింగ్‌ చాలా సప్పగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అది రేటింగ్‌పై కూడా ఎఫెక్ట్ పడిందని, అందుకే ఆమెని తప్పించాల్సి వచ్చిందని అంటున్నారు. అన‌సూయ ఉన్న‌ప్పుడు ఓ రేంజ్‌లో ఉండేద‌ని, కాని ఆమె వ‌చ్చాక రేటింగ్ దారుణంగా ప‌డిపోవ‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితులో మ‌ల్లెమాల వారు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories