Parking OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన సూప‌ర్ హిట్ సెన్సేష‌న్.. పార్కింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..!

December 31, 2023 11:32 AM

Parking OTT : త‌మిళనాట హిట్ అయిన చాలా చిత్రాలు తెలుగులోకి వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిన్న సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు హరీష్ కళ్యాణ్ అలాగే సీనియర్ నటుడు ఎం ఎస్ భాస్కర్ లు నటించిన చిత్రం “పార్కింగ్” కూడా ఒకటి. దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రం రెండు జెనరేషన్ ల మధ్య ఈగో నేపథ్యంలో వచ్చింది. మరి తమిళ నాట చాలా పెద్ద హిట్ అయ్యిన ఈ సినిమా మూవీ లవర్స్‌కి గట్టిగానే వినిపించింది.. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ్ సినీ పరిశ్రమలో సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది.

అద్దె కారు యజమాని వారి జీవితంలో ఎదుర్కొనే వాస్తవిక సమస్యల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నటుడు ఎంఎస్ భాస్కర్ హరీష్ కళ్యాణ్ తరహా పాత్రలో నటించారు. హరీష్ కళ్యాణ్ సరసన ఇందుజ కూడా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలైన నెలరోజుల లోపే.. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు థియేటర్లలో చూడని ఈ కామెడీ డ్రామాను ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూడొచ్చు.ఈ సినిమా నేటి నుంచి తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో వచ్చేసింది. మరి తెలుగులో కూడా చూడాలి అనుకునేవారు ఈ సినిమాని ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా సుధన్ సుందరం నిర్మాణం వహించారు.

Parking OTT these are the streaming details
Parking OTT

చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే హీరో ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే, హీరో ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య తలెత్త‌డంతో… ఇంటి ఓనర్‌కు, హీరోకు మధ్య పెద్ద వాగ్వాదమే కాకుండా కొట్టుకునే వ‌ర‌కు వెళ‌తారు. ఆ త‌ర్వాత అది పోలీసుల కేసు వరకు వెళ్తుంది. చివరికీ ఈ పార్కింగ్ సమస్యను ఎలా పరిష్కరించారనేదే మూవీ కథ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories