Ravi Teja : ఏంటి.. ర‌వితేజ ఆ సినిమాకి కేవ‌లం 10 రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ మాత్ర‌మే తీసుకున్నాడా..!

December 28, 2023 7:52 PM

Ravi Teja : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది.మొదట సైడ్ క్యారెక్టర్స్ చేసిన రవితేజ.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో ఫుల్ ఎంట‌ర్‌టైన్మెంట్ అందిస్తున్నారు. ఇక క్రాక్‌తో మంచి హిట్ అందుకున్న ర‌వితేజ ఇప్ప‌టికీ మంచి స‌క్సెస్‌ల‌ని చ‌వి చూస్తున్నాడు. అయితే నటుడు కావాలనే ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ర‌వితేజ ఎన్నో క‌ష్టాల‌ని చ‌వి చూశాడు. 60 ఏళ్లకు అతి దగ్గరలో ఉన్న మాస్ రాజా ..ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. హ్యాండ్సమ్ గా తయారవుతున్నాడు.

రవితేజకి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ ఉండ‌గా, త‌న ప్ర‌తి సినిమాకు 40కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఈగల్ సినిమాపైఅందరి దృష్టి ఉంది. ఈ ఏడాది టైగర్ నాగేశ్వర రావుతో నిరాశ‌ప‌రిచిన ర‌వితేజ ఇప్పుడు ఈగ‌ల్ చిత్రంతో అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని అంటున్నారు. ఇప్పుడు రవితేజకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన అల్లరి ప్రియుడు సినిమాలో రవితేజ కీలకపాత్రలో కనిపించాడు. అప్పట్లో ఆ సినిమా కోసం రోజుకు రూ. 10 రెమ్యునరేషన్ తీసుకునేవాడట. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి త‌క్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకొని సినిమాలు చేసిన ర‌వితేజ ఇప్పుడు కొన్ని కోట్లు అందిపుచ్చుకుంటుండ‌డం విశేషం.

Ravi Teja took only 10 rs remuneration for that movie
Ravi Teja

రవితేజ.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమాలో సెకండ్ హీరోగా కనిపించాడు రవితేజ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది అంతేకాకుండా రవితేజకు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయనకు హీరోగా వరుస అవకాశాలు క్యూ కట్టాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించిన నీకోసం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ర‌వితేజ‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now