Jyothsna Tirunagari : నా ద‌గ్గ‌ర అన్ని ఆధారాలు ఉన్నాయి.. వ‌ర్మ క‌ట‌క‌టాలు లెక్క‌పెట్టేలా చేస్తాన‌న్న‌ మ‌హిళా నేత‌..

December 28, 2023 7:36 PM

Jyothsna Tirunagari : రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌నాల‌కి మారు పేరు.వర్మ పుట్టిన తర్వాత వివాదం పుట్టిందా అనేంత తన సినిమాలతో పాటు తన ఆటిట్యూట్‌తో ఎపుడు వార్తల్లో ఉంటారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే వ‌ర్మ‌ తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడును నెగిటివ్‌గా చూపిస్తూ వ్యూహం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సెన్సార్ కాకుండా లోకేష్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినా.. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేసారు. గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణలను టార్గెట్ చేసిన ఈయన.. ఇపుడు మరోసారి వ్యూహం అనే సినిమాతో సంచ‌ల‌నం సృష్టించ‌బోతున్నాడు.

నిజానికి నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాకు సెన్సార్‌ కమిటీ అభ్యంతరం చెప్పడంతో వాయిదా పడింది. తిరిగి బెంగళూరులోని రివైజ్ కమిటీ సిఫార్సు మేరకు డిసెంబర్ 29న థియేటర్లో విడుదల కానుంది. అయితే గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుంది. తాజాగా చిత్ర ద‌ర్వ‌కుడు వ‌ర్మ‌పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నతిరునగరి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను అవమానిస్తున్నారని, అత‌నిపై కఠిన చర్యలు తీసుకోవాలని జ్యోత్స్న ఫిర్యాదు చేశారు.

Jyothsna Tirunagari complained about ram gopal varma
Jyothsna Tirunagari

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని కలిసి తన ఫిర్యాదు పత్రాన్ని జ్యోత్స్న అందజేశారు. వ‌ర్మ సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు కూడా పెడుతున్నారని కమిషనర్ దృష్టికి జ్యోత్స్న తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ సమర్పిస్తామని కూడా చెప్పారు. నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని పేటీఎం బ్యాచ్‌ల మాదిరిగా మీరు కూడా తయారైతే ఊరుకునే ప్రసక్తే లేదు. మాకు తెలంగాణ పోలీసుల మీద చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా రాంగోపాల్ వర్మ మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారని మేం భావిస్తున్నాం అని జ్యోత్స్న అని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now