Mangalavaaram OTT Release : ఓటీటీలోకి వ‌చ్చేసిన మంగ‌ళ‌వారం మూవీ.. ఎందులో అంటే..?

December 26, 2023 5:12 PM

Mangalavaaram OTT Release : ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ సినిమా త‌ర్వాత పాయ‌ల్ ఖాతాలో ఒక్క హిట్ కాలేదు. కాని తాజాగా మంగ‌ళ‌వారం చిత్రంతో మంచి హిట్ కొట్టింది. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి దర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. ఇటీవ‌ల ఈ ద‌ర్శ‌కుడు ‘మహా సముద్రం’ అనే సినిమా చేసాడు, కానీ అది పెద్దగా హిట్ కాలేదు. అందులో శర్వానంద్, సిద్ధార్థ్ లాంటి ఇద్దరు మంచి నటులున్న, అదితి రావు హైదరి లాంటి నటి వున్నా కూడా ఎందుకో ఈ చిత్రం జ‌నాల‌కి పెద్ద‌గా ఎక్క‌లేదు. ఇక ఈ సినిమా త‌ర్వాత అజ‌య్ భూప‌తి మంగ‌ళ‌వారం అనే సినిమా చేశాడు. ఇది నవంబర్ 17న థియేటర్స్ లో విడుదలైంది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన మంగళవారం సినిమా ఈ ఏడాది హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో ఈ సినిమా నవంబరు 17న రిలీజ్ అయింది. అయితే, క్రికెట్ వరల్డ్ కప్ సమయం కావడంతో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంగళవారం నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా, ఓటీటీలో ఈ సినిమాని ప్ర‌తి ఒక్క‌రు ఎంజాయ్ చేస్తున్నారు. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసింది. మంగళవారం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోంది.

Mangalavaaram OTT Release know the platform and streaming details
Mangalavaaram OTT Release

సినిమా కథ విషయానికి వస్తే.. ఆంధ్రాలోని ఓ పల్లెటూరులో 1996 లో జరిగిన మిస్టరీ హత్యలే ప్రధానాంశం. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని గుర్తుతెలియని వ్యక్తులు గోడ మీద పేర్లు రాయడం, ఆ మరుసటి రోజే వాళ్లిద్దరూ చనిపోవడం ఊళ్లో సంచలనం సృష్టిస్తుంది. ఇలా వరుస మరణాలతో ఊళ్లో కలకలం రేగుతుంది. ఇవి హత్యలా.. పరువుపోయిందని వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడ్డారా.. గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు.. ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్ పుత్) కు ఉన్న సంబంధం ఏంటనేది చిత్ర క‌థ‌. అయితే ఈ హత్యల వెనకున్న మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now