6000ఎంఏహెచ్ బ్యాట‌రీ, అమోలెడ్ డిస్‌ప్లేతో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ ఎం21 (2021) స్మార్ట్ ఫోన్‌..!

July 22, 2021 11:05 AM

శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎం21 పేరిట 2021 ఎడిష‌న్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. గ‌తేడాది ఎం21 ఫోన్‌ను విడుద‌ల చేయ‌గా, దానికి కొన్ని మార్పులు చేసి ఈ కొత్త ఎడిష‌న్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Samsung Galaxy M21 2021 smart phone launched

శాంసంగ్ గెలాక్సీ ఎం21 (2021) ఫీచ‌ర్లు

  • 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే
  • 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్
  • ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్
  • 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10
  • 48, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
  • బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎం21 (2021) స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,499 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,499గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో జూలై 26వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment