How To Store Onions : ఉల్లిపాయలకు మొలకలు రాకుండా, చెడిపోకుండా ఉండాలంటే.. ఇలా స్టోర్ చెయ్యండి..!

December 20, 2023 6:07 PM

How To Store Onions : ప్రతిరోజు మనం వంటల్లో ఉల్లిపాయల్ని వాడుతూ ఉంటాము. ఇంచుమించుగా అన్ని కూరల్లో కూడా, ఉల్లిపాయల్ని వేసుకుంటూ ఉంటాము. ఉల్లిపాయ వంటకి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఉల్లి బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఉల్లిపాయ లేకుండా, కూర చేసినా అస్సలు ఇష్టపడరు. అయితే, ఉల్లిపాయలని ఎక్కువగా మనం కొని తెచ్చుకుంటూ ఉంటాము. ఒక్కోసారి. ఉల్లిపాయలు పాడైపోవడం లేదంటే మొలకలు వచ్చేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి జరగకుండా ఉల్లిపాయలు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి అనే దానిని చూద్దాం.

ఇలా కనుక, మీరు ఉల్లిపాయల్ని స్టోర్ చేసుకున్నారంటే, మొలకలు రావు. పైగా చెడిపోకుండా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఉల్లిపాయలని చల్లని, పొడి, చీకటి బాగా వెంటిలేషన్ వచ్చే గదిలో నిల్వ చేయాలి. ఉల్లిపాయలు ఈజీగా తేమను గ్రహిస్తాయి. ఉష్ణోగ్రతలు లేదా తేమ ఎక్కువ ఉంటే, మొలకెత్తడం లేదా కుళ్ళిపోవడం జరుగుతుంటాయి. ఉల్లిపాయల్ని నిల్వ చేయడానికి నాలుగు నుండి పది డిగ్రీల సెంటిగ్రేట్ మంచి ఉష్ణోగ్రత అని ఆనియన్ అసోసియేషన్ చెప్పడం జరిగింది. కాబట్టి, ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

How To Store Onions follow these tips to keep them fresh always
How To Store Onions

ఉల్లిపాయలు కుళ్ళిపోవు. పైగా ఫ్రెష్ గా ఉంటాయి. ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా ఉండాలంటే, ఓపెన్ బాస్కెట్ లేదంటే వెదురు, మెష్ బ్యాగ్, నెటెడ్ బ్యాగ్ వంటి వాటిలో నిల్వ చేయండి. గాలి వచ్చినా కూడా ఉల్లిపాయలు చెడిపోవు. అలానే, ఉల్లిపాయల్ని ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయద్దు. ఇందులో నిల్వ చేస్తే, రంధ్రాలు ఉన్న బ్యాగుల్లో వేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఉల్లిపాయల్ని ఫ్రిజ్లో పెట్టకండి. ఉల్లిపాయలకి సహజంగానే తేమని గ్రహించే లక్షణం ఉంటుంది.

ఫ్రిడ్జ్ లో పెడితే, త్వరగా మెత్తబడిపోతాయి. పాడైపోతాయి. ముక్కలు చేసిన ఉల్లిపాయల్ని మాత్రం, మీరు ఫ్రిజ్లో పెడితే ఎక్కువ సేపు పాడవకుండా ఉంటాయి. ఉల్లిపాయ పైన పొరని పూర్తిగా తొలగించి, ఫ్రిజ్ లో ఉంచడం వలన, 10 నుండి 14 గంటల పాటు పాడవకుండా అవి ఉంటాయి. తేమ ఉన్న ప్రాంతంలో, ఉల్లిపాయల్ని కనుక నిలువ చేశారంటే అవి మొలకెత్తవు. అలానే కుళ్ళిపోవు కూడా. గాలి వెళ్లలేని డబ్బాల్లో కానీ ప్లాస్టిక్ కవర్లలో కానీ ఉల్లిపాయల్ని నిల్వ చేశారంటే, మాత్రం పాడైపోతాయి. గుర్తుపెట్టుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now