వీడియో వైరల్: సుడిగాలిలా దోమల దండు.. దేనికి సంకేతమో తెలుసా?

July 21, 2021 9:22 PM

సాధారణంగా మనం సుడిగాలులు రావడం చూస్తుంటాము. అయితే ఈ విధంగా సుడిగాలిలా వచ్చేవన్నీ గాలులు కాదని, కొన్నిసార్లు సుడిగాలి మాదిరిగా.. సుడిగాలి తరహాలోనే దోమలు కూడా దండయాత్ర చేస్తాయని చెప్పవచ్చు. అచ్చం సుడిగాలి తరహాలోనే దోమలు కూడా దూసుకు వస్తాయని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అని చెప్పవచ్చు.

ఈనెల 17వ తేదీన తూర్పు రష్యాలోని కమ్చట్కా క్రాయ్ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వింత ఘటనను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. అయితే అతనికి ఎదురుగా సుడిగాలి వస్తుందని భావించిన అతను వీడియో తీయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి సుడిగాలి దగ్గరగా వెళితే అతనికి ఆశ్చర్యపోయే ఘటన ఎదురైంది. దూరంనుంచి చూడగానే సుడిగాలిగా కనిపించినా..దగ్గరికి వెళ్తే అది సుడిగాలి కాదని.. అది ఒక దోమల దండు అని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయాడు.ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ఈ దోమల దండు వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

https://youtu.be/i6jWJQ0K4mo

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా దోమలు అన్ని ఒక్కసారిగా వ్యాప్తి చెందడానికి గల కారణం ఏమిటి ఇది దేనిని సూచిస్తుంది అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేయగా. ఈ క్రమంలోనే కొందరు ఈ విధంగా దోమల దండు రావడం ప్లేగు వ్యాధికి సంకేతమని చెబుతున్నారు.ఏదేమైనా ఇలాంటి దోమల నుంచి దూరంగా ఉండటం ఎంతో ఉత్తమమని పలువురు నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now