Carom Seeds For Gas Trouble : చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రికైనా స‌రే.. ఇలా చేస్తే గ్యాస్ పోతుంది..!

December 19, 2023 3:29 PM

Carom Seeds For Gas Trouble : ఈ మధ్యకాలంలో, చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి, ఎటువంటి అనారోగ్య సమస్య అయినా, ఇంటి చిట్కాలతో తొలగించుకోవచ్చు. మారిన జీవన శైలి, వయసు పైబడటం మొదలైన కారణాల వలన, ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టకపోతే, అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఎక్కువమంది, ఈరోజు గ్యాస్ట్రిక్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి, బయటపడడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినప్పటికీ కుదరట్లేదు. ఈ సమస్య తగ్గడానికి, మందులు కాకుండా ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇంటి చిట్కాలతో, ఈజీగా సమస్యను తగ్గించుకోవచ్చు. వాము గ్యాస్ ఏర్పడకుండా చూస్తుంది. పెద్దవాళ్లు కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు, వాముని ఔషధంగా ఇచ్చేవారు. వామును తీసుకుంటే, అజీర్తి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. పావు స్పూన్ వాము తీసుకుని, అందులో చిటికెడు సైంధవ లవణంని కానీ ఉప్పుని కానీ కలిపి నమిలి, ఆ రసాన్ని మింగేయాలి.

Carom Seeds For Gas Trouble take them in this way for better effect
Carom Seeds For Gas Trouble

ఇలా చేయడం వలన, కడుపు లో చేరిన గ్యాస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇది వగరుగా ఉన్నప్పటికీ తీసుకోండి. దీనిని తీసుకున్నాక, అర గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. అంతే, చక్కగా పనిచేస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఆహారం జీర్ణం అవ్వనప్పుడు, వాము తీసుకుంటే చాలు. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ఒకవేళ తక్కువ సమస్య ఉన్నట్లయితే, ఇలా ఇంటి చిట్కాని ట్రై చేయొచ్చు. వాము చక్కగా పనిచేస్తుంది. పైగా మనం ఇంట్లో వాడతాం కాబట్టి, ఈజీగానే తీసుకోవచ్చు. వామును తింటే ఇబ్బందిగా ఉంది అనుకుంటే, వెంటనే నీళ్లు తాగేయండి. లేదంటే నీళ్లలో వాముని అయిదు నిమిషాలు పాటు మరిగించి, నీటిని వడకట్టేసుకుని కాఫీ, టీ లాగానే తీసుకుంటే మంచిది. గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు ఏమి కూడా ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now