పరీక్ష లేకుండా 1110 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

July 21, 2021 6:13 PM

నిరుద్యోగ అభ్యర్థులకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ శుభవార్తను తెలిపింది.PGCIL లో ఖాళీగా ఉన్నటువంటి 1110 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలలో హైదరాబాద్ రీజియన్ లలో 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి నేటి (జూలై 21) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ ఉద్యోగాలకు ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ డిప్లమో, ఐటిఐ చేసిన వారు అర్హులు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం విద్యార్హతతో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 20 న ఆఖరి తేదీ.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలలోపు వారై ఉండాలి.ఇందులో ఎంపిక అయినవారికి ప్రతి నెల రూ.11,000 నుంచి రూ.15,000 వరకు స్టయిఫండ్ చెల్లిస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆగస్టు 20 వ తేదీ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ క్రింది వెబ్ సైట్ ని సంప్రదించవలెను. https://www.powergridindia.com/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment