Rajinikanth Net Worth : వామ్మో.. ర‌జ‌నీకాంత్‌కి అంత ఖ‌రీదైన బంగ్లాలు, కార్లు ఉన్నాయా.. ఆస్తుల విలువ తెలిస్తే షాక‌వుతారు..!

December 13, 2023 3:54 PM

Rajinikanth Net Worth : త‌న స్టైల్‌తో కోట్లాది మంది అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్న న‌టుడు ర‌జనీకాంత్. సౌత్ సినిమా ఇండస్ట్రీ ఆరాధ్య దైవంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగాను అశేష ప్రేక్ష‌కాద‌రణ పొందారు. . ఎక్కడికి వెళ్లినా తలైవాకు అభిమానులు నీరాజనం పలుకుతారు. బస్ కండక్టర్ నుంచి మొదలైన ఆయన ప్రయాణం.. ఆ తర్వాత సూపర్ స్టార్ ను చేసింది. ఇటీవల జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. దీంతో రజనీకాంత్ కు జైలర్ సినిమా కి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..రజనీకాంత్ ఎంతో మంది నిర్మాతలకు సినిమాలు ఫ్లాప్ అయితే డబ్బులను కూడా తిరిగి ఇచ్చేవారట.అయినప్పటికీ కొన్ని వందల కోట్ల ఆస్తిని సైతం సంపాదించారు.

రజినీకాంత్ ఆస్తి విలువ ఇటీవ‌లి కాలంలో హాట్ టాపిక్‌గా మారింది. అత‌నికి 445 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. చెన్నైలో పోయెస్ గార్డెన్‌లో విలాసవంతమైన ఒక ఇల్లు ఉన్నదట. దీన్ని 2002లో రజనీకాంత్ చాలా ఇష్టంగా నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ వద్ద రెండు రోల్స్ రాయిస్ సహా అనేక లగ్జరీ కార్లు ఉన్నాయట. రూ.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రూ.16.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉన్నాయని.. అవే కాకుండా టయోటా ఇన్నోవా, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని వంటి కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అత్యంత ఖరీదైన వాహనాల్లో రూ. 1.77 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, రూ. 2.55 కోట్ల విలువైన మెర్సిడెస్, రూ. 3.10 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరస్ ఉన్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం

Rajinikanth Net Worth do you know about his properties
Rajinikanth Net Worth

రజినీ కాంత్ కు రాఘవేంద్ర మండపం అనే కళ్యాణ మండపం కూడా ఉండగా.. ఇందులో 275 మంది అతిథులు, 1000 మందికి పైగా ఆహ్వానితులు కూర్చునే సామర్థ్యం ఉంది. దీని విలువ దాదాపు రూ.20కోట్లు ఉంటుందని సమాచారం. బస్ కండక్టర్ నుంచి.. సినిమాలపై ఇంట్రెస్టుపై సినీ రంగంలోకి అడుగుపెట్టిన త‌లైవా.. అనేక దశాబ్దాలుగా ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నాడు. అతని స్టైలంటే ప్రజలను ఎంతో ఇష్టం. 1975లో అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రజినీ.. అప్పటి నుంచి ఎన్నో చిత్రాలు తెలుగు,తమిళ్, హిందీ పరిశ్రమలో తనదైన ముద్ర చాటుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now