Top Trending Serials In Telugu : ప్ర‌స్తుతం తెలుగులో దుమ్ము రేపుతున్న సీరియ‌ల్స్ ఏంటో తెలుసా..?

December 12, 2023 10:04 PM

Top Trending Serials In Telugu : సినిమాల‌కి ఎప్ప‌టి నుండో క్రేజ్ ఉంద‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే ప‌రిస్థితులు మారుతున్న కొద్ది ప్రేక్ష‌కులు రియాలిటీ షోస్, సీరియ‌ల్స్ అలానే వెబ్ సిరీస్‌ల‌పై ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు.అయితే ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చినా.. కేబుల్ టీవీలు పోయి ఓటీటీలు వచ్చినా..బుల్లి తెరపై ఎన్నిరకాల ప్రోగ్రామ్స్, వినోద కార్యక్రమాలు వచ్చినా సీరియల్స్ స్థానం ఎప్పుడూ పదిలమే. సీరియల్స్ కు ఉండే ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమాలు, సిరీస్ లు, ఆటలు, పాటలు ఇన్నా ఎన్ని ప్రసారం అయినా ఇంట్లో ఆడవాళ్లకు ఇప్పటికీ సీరియల్స్ తోనే కాలక్షేపం అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లు సీరియల్స్ కు భారీగా టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతూ ఉంటాయి. ఎన్ని ఏళ్ళు ప్రసారం చేసినా ఆ సీరియల్ ను మహిళలు ఆదరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్స్ పరంగా తెలుగు లో టాప్ సీరియ‌ల్స్ ఏవి ఉన్నాయ‌నేది చూస్తే..

ఈ ఏడాది తెలుగులో దుమ్మురేపుతున్న టీవీ సీరియ‌ల్ బ్రహ్మమూడి..స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న‌ ఈ సీరియల్ ఇఫ్పటికీ అన్ని సీరియల్స్ లోనూ టాప్ గా నిలుస్తోంది. ముగ్గురు ఆడపిల్లలు.. ఒకే ఇంటికి కోడళ్లు ఎలా వెళ్లారు.. అక్కడ వారి జీవితం ఎలా ఉంటుంది అనే యాంగిల్ లో ఈ కథ సాగుతుండ‌గా, ఇది అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. రెండోది నాగ పంచమి.. ఈ సీరియల్ కూడా స్టార్ మాలోనే ప్రసారం అవుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ క‌థ‌తో రూపొందిన ఈ సీరియ‌ల్ అంద‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మూడోది నువ్వు, నేను ప్రేమ..ఒకప్పుడు హిందీలో వచ్చిన పాపులర్ సీరియస్ ఇస్ పార్యా కో క్యా నామ్ ధూ ని తెలుగులో నువ్వు, నేను ప్రేమ పేరిట రీమేక్ చేయ‌గా, ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కి బాగా క‌నెక్ట్ అయింది. నాలుగోది కృష్ణ ముకుంద మురారి.. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సీరియల్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Top Trending Serials In Telugu must know about them
Top Trending Serials In Telugu

ఐదోది మామగారు.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్ కూడా ప్రేక్ష‌కుల‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఆరోది త్రినయని.. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియ‌ల్.. రియాల్టీ కి దూరంగా రూపొందిన‌, ఈ సీరియల్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఏడోది..గుండె నిండా గుడి గంటలు.. స్టార్ మాలో కొత్తగా మొదలైన సీరియల్ బాధ్యతగల అమ్మాయికీ, బాధ్యతలేని అబ్బాయికి పొత్తు ఎలా కుదిరింది అనే నేపథ్యంలో ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఎనిమిదోది పడమటి సంధ్యారాగం.. జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్ అక్కాచెల్లెళ్ల కథ గా సాగుతుంది. తొమ్మిదోది గుప్పెడంత మనసు.. స్టార్ మా లో సాగే ఈ  సీరియల్ ఒకప్పుడు టాప్ వన్ లో ఉండ‌గా, ఇప్పుడు తొమ్మిదో స్థానానికి చేరింది. ఇక ప‌దోది జగధాత్రి..జీ తెలుగులో వస్తున్న సీరియల్ సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ గా ఓ అమ్మాయి సమస్యలను పరిష్కరించే నేపథ్యంలో రూపొంది ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now