లోకో పైలెట్ల సమయస్ఫూర్తితో మృత్యువు నుంచి బయటపడిన 70 ఏళ్ల వృద్ధుడు!

July 20, 2021 9:50 PM

సాధారణంగా రైలు పట్టాలు దాటడం చట్టపరంగా నేరం అనే విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా రైలు పట్టాలు దాటడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు తలెత్తవచ్చు. ఈ క్రమంలోనే ఓ 70 ఏళ్ల వృద్ధుడు రైలు పట్టాలను దాటుతూ ప్రమాదం అంచున వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. కేవలం లోకో పైలెట్ల సమయస్ఫూర్తితో వృద్ధుడు బతికి బట్ట కట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబై సమీపంలోని కళ్యాణ్ స్టేషన్ ఫ్లాట్ ఫారం నంబర్ 4 సమీపంలో మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో  ఒక వృద్ధుడు పట్టాలు దాటుతుండగా ఆకస్మికంగా పట్టాలపై పడిపోయాడు. ఇది గమనించిన చీఫ్ పర్మనెంట్ వే ఇన్ స్పెక్టర్ సంతోష్ కుమార్, లోకో పైలట్లు ఎస్ కె ప్రధాన్, అసిస్టెంట్ లోకో పైలట్ జీ. రవిశంకర్ లను హెచ్చరికలను జారీ చేస్తూ వృద్ధుడికి తెలిసే విధంగా హెచ్చరికలు చేయాలని తెలిపారు. అయితే ఆ హెచ్చరికలను కాదని లోకో పైలెట్లు ఇద్దరూ అత్యవసర బ్రేకులు వేసే ఆ వృద్ధుడిని కాపాడారు.

అత్యవసర బ్రేకులు వేసి రైలు ఆపిన ఇద్దరు పైలెట్లు తరువాత రైలు కింద పడిన వృద్ధుడిని సురక్షితంగా బయటకు తీశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈక్రమంలోనే లోకో పైలెట్లు సమయస్ఫూర్తిని ఉపయోగించి 70 ఏళ్ల వృద్ధుడిని చావు నుంచి కాపాడారని లోకో పైలెట్ల పై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా సీపీడబ్ల్యుఐకి సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అలోక్ కన్సల్ ఇద్దరు లోకో పైలెట్లకు రెండు వేల రూపాయలు నగదు బహూకరించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment