Animal OTT Release Date : యానిమ‌ల్ ఓటీటీ డేట్‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఇక రికార్డులు బ‌ద్దలు కావ‌డం ఖాయం..!

December 8, 2023 9:59 AM

Animal OTT Release Date : ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో దుమ్ము రేపుతున్న చిత్రం యానిమ‌ల్‌. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌బీర్ క‌పూర్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన యానిమ‌ల్ చిత్రం అన్ని భాష‌ల‌లో దుమ్ము రేపుతుంది. యూత్ ఈ చిత్రానికి తెగ క‌నెక్ట్ అయ్యారు. ఈ సినిమా ఇప్ప‌టికే రూ. 500 కోట్ల కలెక్షన్స్ మార్క్ చేరుకుంది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు వెళుతోంది. వెయ్యి కోట్లు ఈజీగా సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. చిత్రంలో ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. యువత ఆయనకు జేజేలు పలుకుతున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి కొద్ది రోజులుగా చ‌ర్చ న‌డుస్తుంది.

డిసెంబర్ 1న యానిమల్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. యానిమల్ సినిమా తొలిరోజే సంచలనం సృష్టించ‌గా, ఇప్ప‌టికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కొత్త సినిమా రిలీజైన తర్వాత 45 నుంచి 60 రోజుల్లోనే సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుంది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని జ‌న‌వ‌రి 26న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్న‌ట్టు స‌మాచారం. హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో అదే రోజు నుంచి యానిమ‌ల్‌ స్ట్రీమింగ్ కానుంద‌ని అంటున్నారు.. థియేట‌ర్‌తో పోలిస్తే యానిమ‌ల్ మూవీ ఓటీటీ వెర్ష‌న్ లెంగ్త్ ఇర‌వై నిమిషాల ఎక్కువ‌గానే ఉండ‌బోతున్న‌ట్లు టాక్ న‌డుస్తుంది. నెట్‌ఫ్లిక్స్ డిజిట‌ల్ రైట్స్ ద‌క్కించుకున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతుండగా, దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.

Animal OTT Release Date know the platform and streaming details
Animal OTT Release Date

ఇక యానిమ‌ల్ చిత్రంలో రణ్‌బీర్‌, రష్మికలతో పాటు అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, త్రిప్తి దిమ్రీ, శక్త్‌ కపూర్‌లు కూడా సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’ను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.. కానీ ఇప్పుడు హిట్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now