Renu Desai : యానిమ‌ల్ మూవీపై రేణు దేశాయ్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

December 7, 2023 10:00 AM

Renu Desai : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రూపొందిన సూప‌ర్ హిట్ చిత్రం యానిమ‌ల్. ఇందులో రష్మిక మందాన క‌థానాయికగా న‌టించ‌గా, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రీ తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. గత నాలుగు రోజుల్లో 400 కోట్లకుపైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. యానిమల్ సినిమా 210 కోట్ల షేర్‌తో టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని కేవలం మూడు రోజుల్లోనే ఫినిష్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా భారీ లాభాలతో ముందుకెళ్తున్నది. ఈ సినిమా ఫుల్ రన్‌లో 800 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.

మ‌రోవైపు యానిమ‌ల్ సినిమాపై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం మూవీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఈ సినిమాపై షాకింగ్ రివ్యూ ఇచ్చింది.ఈ సినిమాని తాను అనుకోకుండా చూడాల్సి వచ్చిందని తెలిపారు. సినిమా అద్భుతంగా ఉందని… ఈ సినిమాతో తాను ప్రేమలో పడిపోయానని చెప్పారు. ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని… మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లో చూడాలని చెప్పుకొచ్చింది.వీక్ హార్ట్ ఉన్న‌వారు ఈ సినిమా చూడ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఎందుకంటే ఇందులో ర‌క్త‌పాత సన్నివేశాలు చాలా ఉన్నాయ‌ని అన్నారు. ఏదైనా ఒక విభిన్న‌మైన సినిమాను చూడాల‌నుకునే వారికి మాత్రం త‌ప్ప‌కుండా యానిమ‌ల్ సినిమా నచ్చుతుంద‌ని త‌న పేర్కొన్నారు రేణు.

Renu Desai sensational comments on animal movie
Renu Desai

సంచ‌ల‌న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాపై నాలుగు పేజీల రివ్యూను విడుదల చేయ‌డం మ‌నం చూశాం. అర్జున్ రెడ్డి వంటి బోల్డ్ మూవీ త‌ర్వాత సందీప్ రెడ్డి వంగా నుండి వ‌చ్చిన ఈ చిత్రంపై క్రేజ్ రోజురోజుకి మ‌రింత పెరుగుతూ పోతుంది. ఈ చిత్రాన్ని చూసిన కొందరు సినిమా కాస్తా లెంగ్తీగా ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ సీన్స్, పాటలు ఇలా బాగున్నాయని.. రణబీర్ తన నటనతో అదరగొట్టారని చెప్పుకొస్తున్నారు. ఇంటర్నెల్ సీన్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందని , విజులవ్స్, ఆ టేకింగ్, ఆ మ్యూజిక్.. సూపర్‌గా ఉందని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now