ఫ్లిప్‌కార్ట్‌లో మ‌రో సేల్‌.. భారీ ఎత్తున తగ్గింపు ధ‌ర‌లు..!

July 19, 2021 10:47 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మ‌రో అద్భుత‌మైన సేల్‌ను త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నుంది. ఈ నెల 25 నుంచి 29వ తేదీ వ‌ర‌కు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఇందులో అనేక ర‌కాల ఉత్ప‌త్తుల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు.

big saving days sale in flipkart starts on july 25th

ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మీ, ఎంఐ, రియ‌ల్‌మి, ఒప్పో, వివో, యాపిల్‌, శాంసంగ్ కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను వినియోగ‌దారులు త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఎల‌క్ట్రానిక్స్‌, యాక్స‌స‌రీల‌పై 80 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు.

టీవీల‌పై 75 శాతం, ఫ్యాష‌న్ ఉత్ప‌త్తుల‌పై 50 నుంచి 80 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు. హోమ్ అండ్ కిచెన్ ఉత్ప‌త్తులు ఈ సేల్‌లో రూ.99 ప్రారంభ ధ‌ర నుంచి ల‌భ్యం కానున్నాయి. కాగా ఈ నెల 26, 27 తేదీల్లో అమెజాన్ కూడా త‌న ప్రైమ్ మెంబ‌ర్ల‌కు మాత్ర‌మే ప్రైమ్ డే సేల్‌ను నిర్వ‌హించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment