Ahimsa OTT Release : రిలీజైన ఆరు నెల‌ల‌కి ఓటీటీలోకి వ‌చ్చిన తేజ అహింస‌.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో..!

December 5, 2023 9:46 PM

Ahimsa OTT Release : ద‌గ్గుబాటి సురేష్ బాబు త‌న‌యుడు ద‌గ్గుబాటి అభిరామ్ ప్ర‌ధాన పాత్ర‌లో తేజ తెర‌కెక్కించిన చిత్రం అహింస‌.అనంది అర్ట్స్ నిర్మించిన ఈ సినిమా ద్వారా గీతిక తివారి హీరోయిన్ గా పరిచయం అయింది. చాలా రోజుల తర్వాత ఆర్పీ పట్నాయక్ చిత్రానికి సంగీతం అందించారు. జూన్ 2 2023న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్నిచోట్లా నెగెటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా 6 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్దమైంది. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు థియేటర్లలో విడుదలైన 45 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫాంపై సంద‌డి చేస్తుండ‌గా, ఈ మూవీ మాత్రం ఆరు నెల‌ల త‌ర్వాత ఓటీట‌లోకి వ‌స్తుండ‌డం విశేషం.

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా, ఎందుకో తెలియ‌దు ఓటీటీ రిలీజ్ చేయ‌లేదు. సెప్టెంబరులో ఈ మూవీ టీవీల్లోకి కూడా వచ్చేసింది. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం కాలేదు. కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. అహింస‌ సినిమా ఈఏడాది జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో అభిమానుల‌ని అల‌రించ‌లేక‌పోయింది. జయం, నువ్వు నేను వంటి ప్రేమ కథా చిత్రాలతో యూత్ లో మంచి పేరు తెచ్చుకున్న తేజ ఈ సినిమాను కూడా దాదాపు అదే తరహాలో తీసిన ఎందుకో తేడా కొట్టింది.

Ahimsa OTT Release know the streaming details
Ahimsa OTT Release

అహింసను నమ్మే హీరో తను మరదలితో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఆమెపై అత్యాచారం జరగడం, మరదలిని దవాఖానలో చేర్చి, విలన్లపై న్యాయ పరంగా పోరాడుతూ సక్సెస్ అవుతున్న సమయంలో మరో విలన్ ఎంట్రీ ఇవ్వడం చివరకు హీరో విలన్లపై ఎలా పగ తీర్చుకున్నాడనే నేపథ్యంలో చిత్రాన్ని చాలా హృద్యంగా తెర‌కెక్కించారు. మూవీ మాత్రం పూర్తిగా నిరాశ‌ప‌ర‌చింది. ద‌గ్గుబాటి హీరో తొలి సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు రెండో సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now