Rashmika Mandanna : యానిమ‌ల్ సినిమాలో ర‌ష్మిక బోల్డ్ సీన్స్.. హిందీ సినిమాకి అయితే అంత తెగిస్తావా..!

December 3, 2023 11:47 AM

Rashmika Mandanna : ఛ‌లో చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డు కెరీర్ మంచిగానే సాగుతుంది. స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా స‌త్తా చాటుతుంది. ఈ బ్యూటీ డీప్ ఫేక్ వీడియో ఆ మధ్య వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోపై స్టార్ హీరోలు, సెంట్రల్ మినిస్టర్ సైతం స్పందించ‌గా ర‌ష్మిక పేరు తెగ మారుమ్రోగింది. అయితే తాజాగా ర‌ష్మిక యానిమ‌ల్ అనే చిత్రంలో న‌టించ‌గా, ఈ ముద్దుగుమ్మ‌కి మ‌రో మంచి హిట్ ద‌క్కిన‌ట్టైంది.

యానిమ‌ల్ చిత్రంలో ర‌ష్మిక స్ట్రాంగ్ బోల్డ్‌గా నటించింది. మునుపెన్నడూ నటించనంత బోల్డ్ గా రష్మిక ఈ సినిమాలో కనిపించింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమందిని నెటిజన్స్ ట్రోల్ చేసే పనిలో పడ్డారు.ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఎంత బోల్డ్‌గా చిత్రాలు తెర‌కెక్కిస్తాడో మ‌నకి తెలిసిందే. ఇప్పుడు యానిమ‌ల్ చిత్రం కూడా అంతే బోల్డ్‌గా రూపొందించాడు. ఇందులో బెడ్‌ సీన్లు, లిప్‌ లాక్‌ సీన్లకి కొదవే లేదు. ఇంట్లో పేరెంట్స్ ముందు, ఆ తర్వాత ఫ్లైట్‌లో అయితే కొదవే లేదు. ఆ సమయంలో వచ్చే పాటలో ఓ రకంగా తెగింపుకి సిద్ధమైందని అంటున్నారు ట్రోలర్స్.

Rashmika Mandanna scenes in animal movie netizen troll her
Rashmika Mandanna

రణ్‌ బీర్‌ కపూర్‌ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో బ్రాలో కనిపించడం , మరోవైపు రణ్‌ బీర్‌ కపూర్‌ ఆమెని బ్రా లాగి కొట్టడంతో వీపు భాగం కమిలిపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా లిప్‌ లాక్‌ సీన్లతో రెచ్చిపోవడం చాలా మందికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. సెక్స్ కి సంబంధించిన చర్చ ఓపెన్‌గా చేసుకోవడం, చాలా దారుణంగా డ‌బుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడ‌డం ప్ర‌తి ఒక్క‌రికి షాకింగ్‌గా మారింది. అయితే దీనిపై ర‌ష్మిక‌పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. హిందీలోకి వెళితే ఎలాంటి హద్దులు కనిపించవని, ఎంతకైనా తెగిస్తారని కొంద‌రు ర‌ష్మిక‌ని దారుణంగా కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now