Rashmika Mandanna : యానిమ‌ల్ మూవీ హిట్ అయినా.. ర‌ష్మిక‌ను తెగ ట్రోల్ చేస్తున్నారుగా.. ఎందుకంటే..?

December 2, 2023 4:12 PM

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంధాన గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆక‌ట్టుకునే అందం, అదిరిపోయే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ‌కి వ‌రుస అవ‌కాశాలు వ‌స్తుండ‌డంతో దూసుకుపోతుంది. అయితే తాజాగా ‘యానిమల్‌’ సినిమాకు సక్సెస్‌ టాక్‌ రావడంతో నేషనల్‌ క్రష్‌ అనే పేరును మరోసారి సార్ధకం చేసుకుంది రష్మిక. తెలుగు, తమిళ చిత్రాల నటిగా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో టాప్‌హీరోయిన్లలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకుంది. పుష్ప సినిమాతో అభినయంలో తన సత్తా చాటింది.

‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’ చిత్రాలతో బాలీవుడ్‌లో పాతుకుపోవాలని ప్రయత్నించిన రష్మిక ఇప్పుడు యనిమల్‌ హిట్‌తో కమర్షియల్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌ నాయికలకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇటీ వలే డీప్‌ ఫేక్‌ వల్ల ఇబ్బంది పడిన రష్మికకు సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. దీని గురించి ఒక సమావేశంలో ఆమె స్పం దించింది. ”డీప్‌ ఫేక్‌ వల్ల సెలబ్రిటీలకే కాదు వేలాది మంది స్త్రీలకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. మనలో ఉన్న బాధ అందరికీ తెలిసినప్పుడు మనకు భరోసా దక్కుతుంది. కొంతరి కారణంగా మన క్యారెక్టర్‌ ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో మౌనం వహించడం కాదు ప్రశ్నించాలి. వాటిని ప్రతిఘటించాలి అని అన్నారు.

Rashmika Mandanna trolled by netizen for her acting in animal movie
Rashmika Mandanna

యానిమల్‌ సక్సెస్‌తో రష్మిక ఉత్తరాదిలో క్రేజ్‌ ఏర్పడిందని, ఈ సినిమాకు 4 సుమారు కోట్ల పారి తోషికం అందుకు న్న ఆమె ఇప్పుడు ఎక్కువ డిమాండ్‌ చేస్తోందని టాక్ వినిపిస్తుంది. మ‌రోవైపు ర‌ష్మికపై ట్రోల్స్ కూడా న‌డుస్తున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. చిత్రంలో ర‌ష్మిక పాత్ర చిన్నదైనా కథ బాగున్నప్పటికీ ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పెట్టలేకపోయింది . అంతేకాదు గతంలో పుష్ప సినిమా విషయంలోనూ ఇదే తప్పు ఇదే ట్రోలింగ్ ఫేస్ చేసింది . రష్మిక మంచి కథ కంటెంట్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టలేకపోయింది అంటూ ట్రోల్ చేశారు జనాలు.ఇప్పుడు ఈ సినిమాలో కూడా డైరెక్టర్ బాగా సీన్స్ ఎలివేట్ అయ్యే విధంగా రాశాడు అని కానీ రష్మిక మందన్నా ఆ గోల్ రిచ్ కాలేకపోయింది అని చెప్పుకొస్తున్నారు. మరికొందరైతే ఈమె ఆంటీలా తయారైపోయింది అని ..సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో కనిపించి మరో ఆంటీ అని ప్రూవ్ చేసుకుంది అని.. ఇక రష్మిక కెరియర్ కతం అని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ర‌ష్మిక ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now