ఎంఐ ఫ్యాన్ ఫెస్టివ‌ల్ 2021.. రూ.1కే ఫోన్లు, టీవీల‌ను కొనే చాన్స్‌..!

April 6, 2021 6:28 PM

మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీకి చెందిన ఎంఐ ఇండియా దేశంలోని త‌న వినియోగ‌దారుల కోసం ఎంఐ ఫ్యాన్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి 13వ తేదీ వ‌ర‌కు ఈ సేల్‌ను ఎంఐ హోమ్స్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా ఎంఐ10ఐ ఫోన్‌, ఎంఐ టీవీ 4ఎ 32 హారిజాన్ ఎడిష‌న్‌, రెడ్‌మీ 9 ప‌వ‌ర్ వంటి డివైస్‌ల‌ను ఫ్లాష్ సేల్‌లో కేవ‌లం రూ.1కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Mi Fan Festival 2021 offers products at rs 1 only

ఇక ఈ సేల్‌లో ఇటీవ‌లే లాంచ్ చేసిన ఎంఐ 10టి ప్రొ ఫోన్‌ను రూ.13వేల డిస్కౌంట్‌తో విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర రూ.35,999గా ఉంది. సేల్‌లో భాగంగా ఎంఐ నోట్‌బుక్ 14 హారిజాన్ ఎడిష‌న్, రెడ్‌మీ నోట్ 9 వంటి డివైస్‌ల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

సేల్‌లో భాగంగా రూ.10వేల‌కు పైబ‌డిన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే గిఫ్ట్ ఓచర్ల‌ను అందిస్తారు. ప‌లు వ‌స్తువుల‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవ‌చ్చు. ఇంకా అనేక ఆఫ‌ర్ల‌ను ఈ ఫెస్టివ‌ల్‌లో అందివ్వ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment