Petrol Pump Business : ఈ బిజినెస్‌లో డ‌బ్బే డ‌బ్బు.. 14వేల కొత్త పెట్రోల్ పంపుల‌కు నోటిఫికేష‌న్‌..!

December 4, 2023 9:07 PM

Petrol Pump Business : చాలా మంది, ఎక్కువగా వ్యాపారాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈరోజుల్లో ఉద్యోగాలు కంటే వ్యాపారమే నయమని భావించి, వ్యాపారాలను స్టార్ట్ చేస్తున్నారు. ఏదైనా మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చూసేవాళ్ళు, ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వచ్చు. దీంతో మంచిగా రాబడి వస్తుంది. నెల అంతా కష్టపడి, ఆఖరిలో జీతం తీసుకోవడం ఇష్టం ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళు, సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటుంటారు. దీనికి పెట్టుబడి ఎంత ముఖ్యమో. అనుభవం, ఆలోచన కూడా కావాలి. ఓపిక కూడా ఉండాలి.

ఏడాది అంతా డిమాండ్ ఉన్న బిజినెస్ చేస్తే మంచిది. అప్పుడు డబ్బులు బాగా వస్తాయి. పైగా లాభం ఎక్కువ ఉంటుంది. పెట్రోల్ బంక్ ని స్టార్ట్ చేయాలన్న ఐడియా మంచిది. ఎవరైనా స్టార్ట్ చేయాలని అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం సూపర్ ఛాన్స్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్, కొత్త పెట్రోల్ బంకులు ఏర్పాటుకు నోటిఫికేషన్ తీసుకొచ్చింది.

Petrol Pump Business how to start and apply details here
Petrol Pump Business

దేశ వ్యాప్తంగా కొత్తగా ఇంకో 14273 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. పెట్రోల్ బంక్ ని ఓపెన్ చేయడానికి అర్హత విషయాలని కూడా చూద్దాం. వయస్సు 21-55 ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ప్యాస్ అయ్యుమ్డాలి. పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసే వాళ్ళు కి రిటైల్ అవుట్‌లెట్, ఇతర బిజినెస్ నిర్వహించడంలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా పక్కా ఉండాలి. దరఖాస్తుదారుడి ఆదాయం కనీసం రూ.25 లక్షలు ఉండాలి. కుటుంబం మొత్తం సంపద రూ.50 లక్షలకు మించకూడదు.

ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అలానే, ఏదైనా వ్యాపారంలో డీఫాల్టర్‌గా కూడా ఉండకూడదు. సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌కు 800 చదరపు మీటర్ల స్థలం కావాలి. రెండు డిస్పెన్సింగ్ యూనిట్ల కోసమైతే 1200 చదరపు మీటర్ల భూమి కావాలి. అర్బన్ ప్రాంతాల్లో అయితేసింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్‌ కోసం 500 చదరపు మీటర్లు, రెండు డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం 800 చదరపు మీటర్ల స్థలం కావాలి. ప్రాంతాన్ని బట్టి రూ.30 లక్షల నుంచి రూ.1 కోటి వరకు పెట్టుబడి వ్యయం ఉండొచ్చు. లాటరీ విధానంలో లైసెన్స్ ఇస్తారు. https://www.petrolpumpdealerchayan.in/ లో పూర్తి వివరాలు చూడవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now