Ayurvedic Tips For Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

December 4, 2023 7:26 PM

Ayurvedic Tips For Thyroid : ఈ రోజుల్లో, చాలామంది, అనేక రకాల ఇబ్బందులకి గురవుతున్నారు. థైరాయిడ్ సమస్య చాలా మందిలో ఇబ్బంది పెడుతోంది. ఈరోజుల్లో మహిళల్లో థైరాయిడ్ వ్యాధి, బాగా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 10 ఏళ్లలో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా పెరిగిపోయాయి. 30 సంవత్సరాలు కంటే, తక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా కనబడుతోంది. చెడు ఆహారపు అలవాట్లు కారణంగానే ఇలా అవుతోందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గడం కారణంగా, థైరాయిడ్ వ్యాధి అనేది వస్తోంది.

ఈ సమస్య ఉన్నట్లయితే, మనం చిన్న చిన్న చిట్కాలతో తరిమికొట్టేయొచ్చు. ఆయుర్వేద పద్ధతుల ద్వారా, దీనిని నివారించవచ్చు. థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడానికి, కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరతో పాటుగా జీలకర్ర కూడా తీసుకోవాలి. జీలకర్రని, కొత్తిమీరని రాత్రంతా నీటిలో నానబెట్టేసి, నీటిని ఉదయాన్నే వడబోసి పరగడుపున తీసుకుంటే, థైరాయిడ్ వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు. అలానే, కాపాలభాతి చేయడం వలన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రాణాయామం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు.

Ayurvedic Tips For Thyroid follow these remedies daily
Ayurvedic Tips For Thyroid

ఇది థైరాయిడ్ హార్మోన్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. థైరాయిడ్ హార్మోన్ పనితీరు మెరుగు పడుతుంది. ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది. అలానే, ప్రతిరోజు కాసేపు నడవడం వలన, శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 15 నిమిషాల పాటు నడిస్తే మంచిది.

ఈ థైరాయిడ్ గ్రంధి పని తీరు తగ్గినప్పుడు, థైరాయిడ్ వ్యాధి అనేది వస్తుంది. ప్రస్తుతం, ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. మహిళలు ఈ పద్ధతుల్ని పాటిస్తే, థైరాయిడ్ సమస్య ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. సో, థైరాయిడ్ ఉన్నట్టయితే, మహిళలు కచ్చితంగా వీటిని పాటించడం మంచిది. అప్పుడు, ఈ సమస్య తగ్గిపోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now