Pimples Home Remedies : మీ ముఖంపై ఉండే ఎలాంటి మ‌చ్చ‌లు అయినా స‌రే ఇలా చేస్తే పోతాయి..!

December 5, 2023 9:32 AM

Pimples Home Remedies : అందంగా ఉండాలని అనుకున్నా కుదరట్లేదా..? మీ అందాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా..? నల్లమచ్చలు, మొటిమలు వంటి వాటితో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. చాలామంది, అందాన్ని పెంపొందించుకోవాలని రకరకాల క్రీములు ఖరీదైన ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. కానీ, అలా కాకుండా మనం ఈజీగా మన అందాన్ని, ఇంటి చుట్కాలతో పెంపొందించుకోవచ్చు. సన్ ఫ్లవర్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది, వీటిని వాడుతున్నారు.

సన్ ఫ్లవర్ సీడ్స్ తో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు, చర్మ ప్రయోజనాలు కూడా మనం ఈ గింజలతో పొందవచ్చు. చర్మం మీద మృత కణాలని తొలగించడానికి, చర్మం కాంతివంతంగా మెరవడానికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి. ఈ గింజలని వాడడం వలన, ముడతలు కూడా తగ్గిపోతాయి. మొటిమలు, నల్లని మచ్చలని కూడా ఈజీగా మనం తొలగించుకోవచ్చు.

Pimples Home Remedies follow these for any type of spots
Pimples Home Remedies

ఇక మరి ఎలా వాడాలి అనేది చూద్దాం. ముందు పొయ్యి మీద పాన్ పెట్టి, గింజలు వేసి డ్రై రోస్ట్ చేయాలి. సన్ ఫ్లవర్ సీడ్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. సీసాలో వేసుకుని, మీరు నిల్వ చేసుకోవచ్చు. ఒక స్పూను సన్ ఫ్లవర్ సీడ్స్ పొడిలో అర స్పూన్ కొబ్బరి పొడి, పావు స్పూన్ జాజికాయ పొడి వేసుకోవాలి.

వీటన్నిటినీ బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులో కొబ్బరి పాలు కూడా పొయ్యండి. అరగంట పాటు అలా వదిలేసి, తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. పది నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే, నల్లని మచ్చలు, మొటిమలు ఈజీగా తొలగిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now