Allu Arjun Remuneration : పుష్ప‌2లో అల్లు అర్జున్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ కావ‌డం ఖాయం..!

November 28, 2023 9:47 PM

Allu Arjun Remuneration : టాలీవుడ్ హీరోలంద‌రు ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరోలుగా మారుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు. పుష్ప.. పుష్ప రాజ్.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు పుష్ప‌ సినిమాతో అల్లు అర్జున్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కింకించిన ఈ సినిమా.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అందరికీ ఫేవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పార్ట్ 2 తీస్తున్నారు.

పుష్ప చిత్రం దేశ‌వ్యాప్తంగా అంత విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి పుష్ప‌2 పైన ఉంది. ఈ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధిస్తుంది. ఇందులో బ‌న్నీ ఎలా అల‌రిస్తాడు అని ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చించుకుంటున్నారు. బ‌న్నీ పార్ట్ 1 కంటే కూడా సుకుమార్ పార్ట్ 2 పై మరింత దృష్టి పెట్టారట. ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్టుగా ఈ చిత్రాన్ని మలచాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నార‌ట‌. పాటలు, డైలాగ్ లతో పాటు అల్లు అర్జున్ క్యారెక్టర్ ను మరింత అందంగా మలుస్తున్నారట. ముఖ్యంగా పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకొని పుష్ప 2 విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుందట చిత్రబృందం.

Allu Arjun Remuneration for pushpa 2 movie know how much it is
Allu Arjun Remuneration

పుష్ప ది రూల్ సినిమాను 2024వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు.. సునీల్, ధనుంజయ్, అనసూయ, విజయ్ సేతుపతి వంటి స్టార్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోట్లలో పారితోషికం తీసుకోబోతున్నాడట. పుష్ప2 కోసం జరిగే పూర్తి బిజినెస్ లో 33 శాతం ఐకాన్ స్టార్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారంట. అంటే ఈ సినిమాకు వచ్చే థియేటర్, ఓటీటీ, డిజిటల్, డబ్బింగ్, పాటలు, శాటిలైట్… ఇలా అన్నీ కలుపులకొని వచ్చే లాభాల్లో హీరోకు 33 శాతం వచ్చేలా బన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాడు అని ప్ర‌చారం జ‌రుగుతుంది. అంటే బ‌న్నీ సుమారు రూ.300 కోట్లకుపైనే దక్కుతుందని స‌మాచారం. ఒక‌వేళ చిత్రం అంత పెద్ద విజ‌యం సాధించ‌క‌పోయిన కూడా రూ. 150 కోట్లు ఈ మూవీకి రావ‌డం ఖాయం అని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now