Tantiram OTT Release Date : భయపెట్టించే తంతిరం ఓటీటీలోకి.. ఎప్పుడు స్ట్రిమింగ్ కానుంది అంటే..!

November 23, 2023 5:36 PM

Tantiram OTT Release Date : థియేటర్లలో హిట్ కానీ సినిమాలు ఓటీటీల్లో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అదరగొడుతున్నాయి. ఇప్పడు అలాంటి జోనర్‌కు చెందిన ఒక సినిమానే ఓటీటీలోకి వచ్చేసింది. అదే..తంతిరం టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ముత్యాల మెహర్ దీపక్ తెరకెక్కించారు. దసరాకు ముందు అక్టోబర్‌ 13న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1 అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ముందుకి రాగా,ఇందులో శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ముత్యాల మెహర్ దీపక్ తెరకెక్కించారు.

భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మందు గుండు సామాన్లు తయారు చేసే బాలచంద్రన్ (శ్రీకాంత్ గుర్రం) అనే వ్యక్తి యొక్క కథని వారికి వినిపించే క్రమంలో ఈ సినిమా మొదలవుతుంది. హీరో చిన్నపుడే అతని తల్లి ఇంటినుండి పారిపోవడం తో బాలచంద్రన్ కి ఆడవారి పట్ల అసహ్యం ఏర్పడుతుంది. ఆడవాసనే గిట్టని ఇతను అయితే తన తండ్రి యొక్క బలవంతం మేరకు అలగిని (ప్రియాంక శర్మ) అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.పెళ్లైనా ఆమె అదే అయిష్టతను కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలేమిటి ? ఆడవాళ్లపై బాల చంద్రన్ తన అభిప్రాయాలను మార్చుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. దర్శకుడు మొదటి భాగం కంటే రెండవ చాప్టర్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టడం వలన మొదటి చాప్టర్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు.

Tantiram OTT Release Date streaming details
Tantiram OTT Release Date

దసరా సినిమాల సందడి మొదలు అయిన స‌మ‌యంలో తంతిరం సినిమా అందుకే థియేటర్లలో రిలీజైంది. అయితే ఏమైందో ఏమో కాని కొన్ని రోజులకే మాయమైపోయింది. ఇప్పుడీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తంతిరం సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం (నవంబర్‌ 11) నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now