Guppedantha Manasu November 23rd Episode : వ‌సుధారపై దేవ‌యాని అబద్దాలు.. రిషి ప్రేమ‌కు మ‌హేంద్ర హ్యాపీ.. శైలేంద్ర‌కు ట్విస్ట్‌..!

November 23, 2023 9:00 AM

Guppedantha Manasu November 23rd Episode : జగతి మరణం వెనుక, తన ప్రమేయం ఉందని అనుమానిస్తూ అనుపమ మాట్లాడిన మాటలతో వసుధారా బాధపడుతుంది. చిన్నవయసులో కాలేజీ ఎండి అవ్వడం ఆశ్చర్యంగా ఉందని, జగతి ప్లేస్ ని ఎలా భర్తీ చేసావని, అనుపమ తనతో ఎందుకు అంది అనే విషయం తెలియక, ఆలోచనలో పడుతుంది. దేవయాని శైలేంద్ర తన గురించి చెడుగా అనుపమకి చెప్పారని, వసుధారకి అర్థమవుతుంది. ఒంటరిగా ఆలోచిస్తున్న వసుధారా దగ్గరికి రిషి వస్తాడు. అనుపమ గురించి ఆలోచిస్తున్నావ అని అడుగుతాడు. తాను కూడా అదే ఆలోచిస్తున్నానని అంటాడు.

నాన్న ఒంటరితనాన్ని చూడలేక, అమ్మ ఆమెను ఇక్కడికి పంపించిందని రిషి అంటాడు. భోజనం చేస్తున్న టైంలో, ఇద్దరి మధ్య స్నేహం బయటపడింది. మహేంద్ర ఇష్టాలు అన్ని అనుపమకి తెలుసు అని వసుధార అంటుంది. చాలా రోజుల తర్వాత, డాడ్ ఆక్టివ్ గా కనిపించారని రిషి చెప్తాడు. అనుపమ తరచూ వస్తూ ఉంటే, మావయ్య పూర్తిగా మారిపోతారని చెప్తుంది వసుధార. ఆమె పెళ్లి చేసుకోకుండా ఉంటాగా ఎందుకు ఉందో తెలియట్లేదు అని అంటుంది. తన జీవితంలో, ఎలాంటి ఆటుపోట్లు ఉన్నాయో ఎవరికి తెలుసు అని రిషి అంటాడు. హ్యాపీగా ఉంటామని అనుకున్న మన జీవితంలోనే దేవుడు ఎన్నో ఒడిదుడుకుల్ని పెట్టారని ఎమోషనల్ అవుతాడు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా, చివరికి కలిసిపోయామని చెప్తుంది. అనుపమ ఇంటి నుండి వెళ్ళాక, మహేంద్ర సంతోషంగా కనపడతాడు. ఈరోజు మీరు చాలా కొత్తగా కనపడుతున్నారని మహేంద్రతో అంటాడు రిషి. తను నార్మల్ గానే ఉన్నానని మహేంద్ర అంటాడు. మీరు ఇలా చిరునవ్వుతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని రిషి, వసుధార చెప్తారు. దేని గురించి ఎక్కువగా ఆలోచించుకోకుండా, మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోమని తండ్రితో అంటాడు. మహేంద్ర ప్రేమను చూసి పొంగిపోతాడు.

Guppedantha Manasu November 23rd Episode today
Guppedantha Manasu November 23rd Episode

అనుపమకి దేవయాని ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావని అడుగుతుంది. నేను ఎక్కడ ఉన్నది తెలుసుకుని ఏం చేస్తారు అని, దేవయానిపై సెటైర్ వేస్తుంది. ఇంటికి భోజనానికి రమ్మని దేవయాని పిలుస్తుంది. తాను మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్లానని, అక్కడే భోజనం చేశానని అనుపమ చెప్తుంది. మహేంద్ర ని కలిసావా నువ్వు, ఏమి అడిగావు, అతను ఏం చెప్పాడు, వసుధార ఏమండి అని దేవయాని అడుగుతుంది. వాళ్ళు ఏం చెప్పారనే దాని గురించి మీరు ఎందుకు ఎక్సయిట్ అవుతున్నారు. ఈ విషయాలు మీకు ఎందుకు అని అంటుంది.

దాంతో దేవయాని కంగారుపడుతుంది. టాపిక్ డైవర్ట్ చేసి, మళ్లీ వసుధార గురించి అడుగుతుంది దేవయాని. వసుధార క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమైందా అని అనుపమని అడుగుతుంది. ఆమె చాలా తెలివైంది అని అనుపమ అంటుంది. తెలివైంది కాబట్టే జాగ్రత్తగా ఉండమని, మంచిదా చెడ్డదా అన్నది ముందు ముందు మీకే తెలుస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అనుపమ పదేపదే మహేంద్ర దగ్గరికి వెళ్తే నిజాలు బయటపడతాయని దేవయాని భయపడిపోతుంది.

కాలేజీలో చిత్ర అనే విద్యార్థిని, ఓ బయట కాలేజీ స్టూడెంట్ వేధిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి వసుధార అతనికి క్లాస్ ఇస్తారు. ప్రపోజ్ చేస్తే, రిజెక్ట్ చేసానని కోపం వచ్చి, ఫోటోలని మార్ఫింగ్ చేశాడని, వాటిని చూపిస్తూ ప్రేమించానని వెంటపడుతున్నాడని రిషి, వసుధార కి చెప్పి అమ్మాయి బాధపడుతుంది. సైలెంట్ గా రిషి అప్పుడే సీన్ లోకి వస్తాడు. ఆ అబ్బాయికి క్లాస్ ఇస్తాడు. ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే, ఆమెని వేధించకూడదని, నిజాయితీగా అమ్మాయి ప్రేమ కోసం, ఎదురు చూడాలని వార్నింగ్ ఇస్తాడు.

కాలేజీ నుండి అతన్ని పంపించేస్తాడు. తండ్రి ముందు ధరణిని పొగుడుతాడు. శైలేంద్ర తండ్రి దృష్టిలో మంచివాడు అని, ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. ఇంటి పనులు కోసం, పనిమనిషిని పెడతాడు. ధరణి ఉండగా పనిమనిషి ఎందుకని భర్తతో వాదిస్తుంది దేవయాని. కొద్దిరోజుల ఇంట్లో ఉండట్లేదని, దేవయానికి షాక్ ఇస్తాడు ఫణీంద్ర. ధరణి, శైలేంద్ర కలిసి కొద్ది రోజులు సంతోషంగా గడపడానికి ఒక ట్రిప్ వెళ్తున్నారని చెప్తాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now